రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీ ఖుషి ( Khushi ).
విజయ్, సమంత ఇద్దరి ఖాతాలో ప్రజెంట్ ప్లాప్స్ ఉండడంతో ఈ జంట హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
విజయ్ లైగర్ సినిమాతో, సమంత శాకుంతలం సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న విషయం తెలిసిందే.అందుకే ఖుషి వంటి ఆకట్టుకునే లవ్ స్టోరీతో అయిన ఇద్దరు కలిసి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
శివ నిర్వాణ ( Shiva Nirvana )తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా షూట్ ఇప్పటికే క్లైమాక్స్ కు చేరుకుంది.
ఆల్మోస్ట్ పూర్తి అయినట్టే సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుస ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగానే చార్ట్ బస్టర్ గా నిలిచింది.హేషమ్ అబ్దుల్( Hesham Abdul ) అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.
ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.ఆరాధ్య అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ప్రోమోను సోమవారం రిలీజ్ చేయనున్నారు.
అలాగే పూర్తి లిరికల్ సాంగ్ జులై 12న రిలీజ్ కానుంది.ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటుంది.విజయ్, సమంత రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్.
ఇక ఈ పాట గురించి విజయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ పాట చాలా ప్రత్యేకమైంది అంటూ తెలిపారు.దీంతో ఆడియెన్స్ మరింతగా ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy