ఆ సీనియర్‌ హీరోయిన్‌కు ఎన్టీఆర్‌ అంటే ఎంత అభిమానమో తెలిస్తే ఎన్టీఆర్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసుడే..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ ఎత్తున ఈయన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.

అద్బుతమైన నటన మరియు మంచి మనసున్న వ్యక్తిగా ఎన్టీఆర్‌ను అంతా కూడా అభిమానిస్తూ ఉంటారు.ఎన్టీఆర్‌ను అభిమానించే వారిలో సెలబ్రెటీల సంఖ్య కూడా చాలానే ఉంటుందని చెప్పుకోవాలి.

తాజాగా కోలీవుడ్‌ నిన్నటి తరం స్టార్‌ హీరోయిన్‌ ఖుష్బూ తనకు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చిది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.

నేను ఎన్టీఆర్‌ను విపరీతంగా అభిమానిస్తాను.ఆయన్ను ఎంత పిచ్చిగా అభిమానిస్తానో నాకే తెలుసు.

Advertisement

ఆయన ప్రతి సినిమాను చిన్నపిల్లాడిలా మొదటి రోజే చూసేందుకు ఆసక్తి చూపుతాను.చూడటం కూడా మామూలుగా కాదు విజిల్స్‌ వేస్తూ, కాగితాలు చించేస్తూ, చప్పట్లు కొడుతో తాను సినిమాను చూసి ఎంజాయ్‌ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

నాకు ఎన్టీఆర్‌ అంటే ఎంత అభిమానమో ఒకసారి ఆయనకే చెప్పాడు.ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ నుండి తాను ఆటోగ్రాఫ్‌ కూడా తీసుకున్నట్లుగా పేర్కొంది.

ఎన్టీఆర్‌పై అభిమానంతోనే ‘మయదొంగ’ చిత్రంలో యముడి భార్యగా నటించాను అంటూ చెప్పుకొచ్చింది.ఆసమయంలో ఎన్టీఆర్‌తో ఎక్కువ సమయం స్క్రీన్‌ ప్రజెన్స్‌ దక్కలేదు.కాని త్వరలోనే మళ్లీ ఆయన సినిమాలో క్యారెక్టర్‌ రోల్‌ చేయాలని కోరుకుంటున్నట్లుగా ఖుష్బు చెప్పుకొచ్చింది.

ఖుష్బు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది.అంతటి హీరోయిన్‌ ఎన్టీఆర్‌పై ఇంతటి అభిమానంను కలిగి ఉండటం నిజం అద్బుతంగా చెప్పుకోవాలి.

మీ జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు