కుర్చీ మడతబెట్టితో యూట్యూబ్ ను మడతబెట్టిన మహేష్ శ్రీలీల.. అన్ని వ్యూస్ వచ్చాయా?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు, శ్రీ లీలా( Mahesh Babu, Sri Leela ) కలిసి నటించిన చిత్రం గుంటూరు కారం.

ఈ ఏడాది విడుదలైన ఈ సినిమా మిత్రులు టాక్ ని సొంతం చేసుకుంది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమాలో పాటలు మాత్రం సూపర్ హిట్ గా నిలిచాయి.

మరి ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన కొచ్చి మడతపెట్టి అనే సాంగ్ మాత్రం యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ పాటకు స్టెప్పులు వేశారు.

వేలాది రీల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.

Kurchi Madathapetti Is Most Listened Song Of 2024 From India, Kurchi Madatha Pet
Advertisement
Kurchi Madathapetti Is Most Listened Song Of 2024 From India, Kurchi Madatha Pet

ఇకపోతే యూట్యూబ్ సంస్థ ( YouTube )తమ ప్లాట్ ఫామ్ లో టాప్ లో నిలిచిన పాటల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది.అందులో భాగంగానే తాజాగా పాటల జాబితాను విడుదల చేసింది యూట్యూబ్. కేండ్రిక్ లామర్ ( Kendrick Lamar )ఆలపించిన నాట్‌ లైక్‌ అజ్‌ యూఎస్‌లో టాప్‌ లో నిలిచింది.

కెనడా, యూకేలో బేసన్ బూన్ ( Besan Boon in Canada, UK )పాడిన బ్యూటిఫుల్‌ థింగ్స్‌, దక్షిణ కొరియాలో క్యూవెర్‌ బ్యాండ్‌ ఆలపించిన టీబీహెచ్‌ పాటలను ప్రేక్షకులు ఎక్కువగా విన్నట్లు తెలిపింది.ఇక ఇండియా నుంచి ఆ రేంజ్ జాబితాలో నిలిచిన ఏకైక పాట కుర్చీ మడతపెట్టి అని తెలిపింది యూట్యూబ్ సంస్థ.

Kurchi Madathapetti Is Most Listened Song Of 2024 From India, Kurchi Madatha Pet

తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ సినిమాలకు సంబంధించి ఎన్నో పాటలు ఈ ఏడాది విడుదల అయ్యాయి.కానీ వీటన్నింటినీ వెనక్కి నెట్టేస్తూ ముందు నిలిచింది.ఏకంగా టాప్ లో నిలిచింది.

సంగీత దర్శకుడు తమన్ ఈ పాటని కంపోస్ట్ చేసిన విషయం తెలిసిందే.మహేష్ బాబు హీరోయిన్ శ్రీ లీల అయితే ఈ పాటకు స్టెప్పులను ఇరగదీసారు అని చెప్పాలి.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

కేవలం పాట మాత్రమే కాకుండా ఇందులో స్టెప్పులు కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి అని చెప్పవచ్చు.అయితే తాజాగా యూట్యూబ్ సంస్థ తెలిపిన జాబితా పై స్పందించిన శ్రీ లీల, థమన్ ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గుంటూరు కారం టీం అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది అని తెలిపారు.చిత్రబృందంతోపాటు తమ పాటను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

దీనిపై తెలుగు సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు అట్లుంటుంది మన మహేష్ బాబు తోటి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ పాటని మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తాజా వార్తలు