సమంత విషయంలో మంత్రి కేటిఆర్ సీరియస్

చేనేత కార్మీకుల శ్రమకి తగిన గుర్తింపు దక్కేలా, చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయించే బాధ్యత తన మీద వేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీఆర్.

ఈ కార్యక్రంలో భాగంగానే నటి సమంతని తెలంగాణ చేనేతకి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.

సమంత కేటిఆర్ తన మీద పెట్టుకున్న నమ్మకం మీద నిలబడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తోంది.మొన్న జరిగిన ఐఫా అవార్డు ఫంక్షన్ కి అందరు హీరోయిన్లు గ్లామర్ డ్రెస్సులు వేసుకోని వస్తే, సమంత మాత్రం తెలంగాణ చేనేతను ప్రమోట్ చేసేలా, తెలంగాణ సంప్రదాయలను ఓ చేనేత చీరపై సింబాలిక్ గా ముద్రించి, దాన్నే ధరించింది.

అలాంటి గ్లామర్ ఈవెంట్ లో కూడా సమంత రాష్ట్రం పట్ల బాధ్యతగా ఉండటం చూపరులని ఆకట్టుకుంది.

అలాంటి సమంత తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ కాదు అంటూ సమాచార హక్కు చట్టం పెద్ద బాంబు పేల్చింది.

తన పేరు పేపర్ లో లేదు అంటూ షాక్ ఇచ్చింది.దాంతో కేటీఆర్ సీరియస్ అయ్యారు.

Advertisement

అధికారులు మరీ ఇంత సమాచార లోపంతో పనిచేస్తున్నారా అంటూ గట్టిగా అడిగేసరికి అది అధికారుల తప్పు మాత్రమే, సమంతని తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించినట్లు తేలింది.వెంటనే తెలంగాణ చేనేత సహకార సంస్థ నుంచి సమంత చేనేతకి బ్రాండ్ అంబాసిడర్, ఆమెని నియమించలేదు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు అని ప్రకటన వచ్చింది.



మొత్తానికి సమంత విషయం తేలిపోయింది.రానున్న రోజుల్లో సమంత ద్వారా చేనేతకి మరింత ప్రచారం చేయిస్తుందట తెలంగాణ ప్రభుత్వం.

కొన్ని యాడ్స్ చిత్రీకరించి థియేటర్స్ లో వేసే ఆలోచనలో కూడా ఉన్నారట.సమంత ఇలా రూపాయి అడక్కుండా, స్వచ్ఛందంగా ఓ మంచిపని కోసం పనిచేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు