ఆ సంచలన నిర్ణయం తో కేటీఆర్ సక్సెస్ అందుకుంటారా ?

తండ్రికి తగ్గ తనయుడిగా, సక్సెస్ ఫుల్ రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి సక్సెస్ తీసుకొచ్చే విషయంలో ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నాడు.

మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించ బోతున్నారు.

అయితే అంతకు ముందే తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండడంతో, ఇక్కడ టీఆర్ఎస్ కు గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో గట్టిగానే కష్టపడుతున్నారు.మొన్నటి వరకు దుబ్బాక ఉప ఎన్నికల లో విజయం సాధిస్తాననే ధీమా ఎక్కువగా ఉండగా, అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో, దుబ్బాక టెన్షన్ టీఆర్ఎస్ లో పెరిగిపోతుంది.

 ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం ఖాయమని మొన్నటి వరదల ముందువరకు అందరిలోనూ ధీమా కనిపించినా, హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా టీఆర్ఎస్ నేతలు అందరిలోనూ ఆ  ధీమా పోయింది.దీనికి కారణం జనాల్లో ఆగ్రహం పెరగడమే.

వేలాది కోట్ల రూపాయలతో జిహెచ్ఎంసి ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నా, మొత్తం భారీ వరదలతో ఆ క్రెడిట్ మొత్తం కొట్టుకుపోవడంతో, ఇప్పుడు టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.భారీ వరదలు, వానలు  కారణంగా, ప్రజలు ఆర్థికంగా, ఎంతో నష్టపోవడంతో, ఆ అసహనం అంతా, గ్రేటర్ ఎన్నికల్లో కనిపిస్తుందేమో అనే భయం టీఆర్ఎస్ అగ్రనేతల్లో కనిపిస్తోంది.

Ktr Focus On Ghmc Elections, Ktr, Ghmc Elections, Trs Senior Leaders, Greater El
Advertisement
KTR Focus On GHMC Elections, KTR, GHMC Elections, TRS Senior Leaders, Greater El

దీనికి తోడు టీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్ల లో చాలామంది పై ప్రజా వ్యతిరేకత ఉండటంతో, వారిలో చాలా మందిని తప్పించి, కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది.ప్రజా వ్యతిరేకతను కాస్త తగ్గించేందుకు, ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు వరద సహాయం ప్రకటించి పంపిణీ చేసిన గ్రేటర్ పరిధిలోని వరద బాధితులు సంతృప్తిని మాత్రం కలిగించలేదు.ఇప్పటికే వరద సాయం పంపిణీ చేయడంతో పాటు, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్తున్న టీఆర్ఎస్ చోటామోటా నాయకులకు,  అగ్ర నేతల పర్యటన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, సిట్టింగులను ఎక్కువ శాతం తప్పించి ప్రజాబలం ఉన్న కొత్తవారికి టికెట్ ఇవ్వడం ద్వారా, కాస్త పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవచ్చు అనే అభిప్రాయంలో కేటీఆర్ ఉన్నారట.

ఏదో ఒకరకంగా గ్రేటర్ ఎన్నికల్లో సక్సెస్ కొట్టి ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇవ్వాలి అని కేటీఆర్ చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు