కేటీఆర్ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తున్నారా?

ఒక గీతను చిన్నదో పెద్దదో ఎలా నిర్ణయిస్తాం ? దాని పక్క మరో గీత గీయడం ద్వారా.

ఆ గీత పక్కన పెద్ద గీత గీస్తే ఇది చిన్నగా కనబడుతుంది అదే చిన్న గీత గీస్తే ఇది పెద్దగా కనబడుతుంది.

ఇప్పుడు బారసా వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు( K.T.Rama Rao ) కూడా ఇదే స్ట్రాటజీని భాజాపాపై ప్రయోగించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరుస్తున్నాయి.

ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆయన తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని వచ్చే ఎన్నికలలో తమ పార్టీ అధికారంలోకి కచ్చితం గా వస్తుందని కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలుస్తుంది అంటూ ఆయన జోస్యం చెప్పారు .భాజాపా పార్టీ( BJP ) బలమంతా సోషల్ మీడియాలో తప్ప వాస్తవ ప్రపంచంలో ఉండదని అలాంటి భాజాపాను అసలు తాము ప్రత్యర్థిగానే భావించడం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ బారాస ఒకటే అంటూ ఈమధ్య బీజేపీ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తుంది .కాంగ్రెస్ పార్టీ బారాస పార్టీకి బి పార్టీ అని తెరవనక కాంగ్రెస్కు ఆర్థిక సాయం చేస్తున్నది బారాస పార్టీ అని కెసిఆర్ ని ఎదిరించాలంటే అది భాజపా వల్ల మాత్రమే అవుతుందని భాజపా నాయకులు వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.దానిని ఎదుర్కోవటం కాంగ్రెస్ పార్టీ నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది .ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కూడా భావోద్వేగంగా స్పందించిన విషయం తెలిసిందే.

Advertisement

.అయితే బాజాపా అనుసరిస్తున్న ఈ స్ట్రాటజీ కి కి విరుగుడు మంత్రంగానే కేటీఆర్ ఇలా మాట్లాడారనీ అసలు భాజపాను లెక్కచేయినట్టుగా తెలంగాణలో భాజాపా అసలు ఉనికి లోనే లేనట్లుగా మాట్లాడటంపార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్లోనూ, భాజపాలలోనూ కూడా లోతుగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు