కేటీఆర్ ఆప్తుడికి మంత్రి పదవి కట్టబెడుతున్నారా ?

వడ్డించేవాడు మనవాడయితే బంతిలో ఏ మూలాన కూర్చున్నా ఫర్వాలేదు అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణాలో ఓ వీరవిధేయుడికి మంత్రి పదవి ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా కేటీఆర్ కు అత్యంత ఆప్తుడిగా పేరు పొందిన బాల్క సుమన్ కి మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

బాల్క సుమన్ తో కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆయనను కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ అంత స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత బాల్క సుమన్ కు మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా సామజిక వర్గాల సమీకరణాలు, కొన్ని కొన్ని ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో ఆయనకు చివరి నిమిషంలో మంత్రి పదవి చేజారింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడిగా బాల్క సుమన్ కీలకంగా వ్యవహరించారు.ఆ సమయంలోనే కేసీఆర్ ఆయన్ను గుర్తించారు.ఆ గుర్తింపుతోనే తెలంగాణ అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాల్కా సుమన్ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి పోటీకి దింపారు.

Advertisement

అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వివేక్ పై గెలిచి సంచలనం సృష్టించాడు సుమన్.మొన్న జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బాల్క సుమన్ కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ ను కేసీఆర్ కేటాయించారు.

అప్పటికే అక్కడ బలమైన నాయకుడిగా ఉన్న సీనియర్ నాయకుడు నల్లాల ఓదెలు ను కూడా కేసీఆర్ పక్కకు తప్పించారు.దీనిపై టీఆర్ఎస్ లో అప్పట్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.

ఈ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు వ్యతిరేకించినా అధిష్టానం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన నియోజకవర్గం పరిధి లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేయించారు.తెలంగాణలో పెద్ద జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ లో ప్రస్తుత ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే మంత్రి గా ఉండడంతో ఇప్పుడు బాల్క సుమన్ కు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట.ఈ మేరకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం కల్పించాలని భావిస్తున్నారట.

పైల్స్ వ్యాధి వేధిస్తుందా? ఈ సూప‌ర్ ఫుడ్స్ తో నివారించుకోండిలా!

ఇప్పుడు ఇదే విషయంపై టీఆర్ఎస్ లో జోరుగా చర్చ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు