సినిమా మొదలయ్యాక అరగంట వరకు హీరో ఎంట్రీ ఇవ్వకుండా హిట్ అయినా సినిమా ఇదే !

ఏ సినిమాకైనా కూడా హీరోనే ముఖ్యం.హీరో ఎంట్రీ చూస్తే సినిమా చూస్తున్న వారికే గూస్ బంప్స్ రావాల్సిందే.

కానీ సినిమా మొదలైన వెంటనే హీరో వచ్చేస్తాడు.స్టోరీ ముందుకు వెళ్తుంది.

నాలుగు పాటలు, ఐదు ఫైట్లు.ఇక సినిమా కామర్హియల్ హిట్.

ఇలాగే ఉంటాయి అన్ని సినిమాలు.కానీ ఈ ధోరణికి చరమ గీతం పాడాడు హీరో వెంకటేష్.

Advertisement
Kshanam Kshanam Movie Untold Facts , Kshanam Kshanam , Venkatesh, Sridevi,Direct

ఆ సినిమా మరేదో కాదు క్షణం క్షణం.సినిమా చుసిన ప్రతిసారి ఇది అసలు సినిమానా లేక లైవ్ పెర్ఫార్మెన్స్ ఏమైనా జరుగుతుందా అనే అనుమానం కలగక మానదు.

ఈ సినిమా మొదలయిన తర్వాత అరగంట వరకు వెంకటేష్ ఎంట్రీ లేకపోవడం అప్పట్లో పెద్ద సంచలనం.

Kshanam Kshanam Movie Untold Facts , Kshanam Kshanam , Venkatesh, Sridevi,direct

ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి వెంకటేష్ ఏమి సాధారణ హీరో కాదు ఏకంగా ఇరవై సినిమాల్లో నటించాడు.కానీ క్షణం క్షణం సినిమా కోసం అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా తీసుకోవడమే వెంకటేష్ నిడివి తగ్గించడానికి ప్రధాన కారణం అయ్యి ఉంటుంది.ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు వర్మకు శ్రీదేవి తప్ప ఆ దేవలోకపు రంభ వచ్చిన కళ్ళముందు ప్రత్యేక్షం అయినా కూడా ఒప్పుకోడు కదా.ఇక సినిమా కథ కూడా విచితంగానే ఉంటుంది.హీరో కు విలన్ కి ఎలాంటి సంబంధం ఉండదు.

కథ మొత్తం హీరోయిన్ మరియు విలన్ మధ్యనే జరుగుతుంది.ఇక కేవలం 24 గంటల్లో జరిగే కథ ఈ సినిమా.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

బట్టల ఖర్చు మొత్తం లేకుండా పోయింది.

Kshanam Kshanam Movie Untold Facts , Kshanam Kshanam , Venkatesh, Sridevi,direct
Advertisement

వర్మ ఇప్పుడంటే పిచ్చి పిచ్సి సినిమాలు తీసి జనల ఓపికకు పరీక్షా పెడుతున్నాడు కానీ అప్పట్లో అయన మేధోశక్తి అనితరసాధ్యమైనది.క్షణం క్షణం సినిమా లో విలన్ ఓ వైపు క్రూరంగా హత్యలు చేస్తూ ఉంటూ మరోవైపు కామెడీ కూడా చేస్తూ ఉంటాడు.ఎంతో సహజంగా కనిపించే సన్నివేశాలు, కోటి రూపాయల కోసం హీరోహీరోయిన్ వెంట పెరిగితే విలన్ గ్యాంగ్.

ఎలాంటి అనుభవం లేని విలన్ గ్యాంగ్ నటన ఎంతో సహజంగా ఉండి ఇదొక నాటకం లాగ అనిపిస్తుంది.ఇక సందర్భం తో వచ్చే పాటలు, రామిరెడ్డి లాంటి విలన్ ని పాత్రదారుడిని సాఫ్ట్ గా చూపించిన విధానం వల్ల ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది.

ఈ సినిమా ద్వారా ఉత్తమ దర్శకుడిగా వర్మ, ఉత్తమ నటిగా శ్రీదేవి, సంగీతానికి కీరవాణి ఫిలిం ఫెర్ అవార్డ్స్ సైతం అందుకున్నారు.

తాజా వార్తలు