KRK ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతార కలిసి నటించిన సినిమా కాతువాక్కుల రెండు కాదల్.

నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.

సినిమా తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజైంది.తెలుగులో ఈ సినిమాను కె.ఆర్.కె అని రిలీజ్ చేశారు.సమంత క్రేజ్ తోనే తెలుగులో రిలీజ్ చేసినా కనీసం ఏమాత్రం ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమా మీద ఎఫెక్ట్ పడింది.

ఇక థియేట్రికల్ రన్ తో పాటుగా కె.ఆర్.కె ఓటీటీ రిలీజ్ పై స్పెషల్ న్యూస్ రివీల్ అయ్యింది.కె.ఆర్.కె సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.సినిమాని మే ఎండింగ్ లో ఓటీటీ రిలీజ్ చేస్తారని టాక్.

తమిళంలో ఈ సినిమాకు యావరేజ్ రివ్యూస్ వచ్చాయి.రొటీన్ కథతో స్టార్ కాస్ట్ ని వాడుకున్నారని టాక్ వచ్చింది.

Advertisement

తెలుగులో అయితే సినిమా రిలీజైంది అన్న విషయం కూడా కామన్ ఆడియెన్స్ కు తెలియదని చెప్పొచ్చు.సమంత ఉన్నా సరే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఆమెతో ప్రమోషన్స్ చేయకపోవడం షాకింగ్ గా ఉంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు