Kriti Sanon: వాటికి దూరంగా ఉండాలంటూ అమ్మ వార్నింగ్ ఇచ్చింది: కృతి సనన్

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి సనన్.

ఈమె తెలుగులో రెండు సినిమాలలో నటించి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృతి సనన్ త్వరలోనే ఆది పురుష్ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ తాను హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న సమయంలోనే తన తల్లి తనకు వార్నింగ్ ఇచ్చిందంటూ ఈమె తెలియజేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే తప్పనిసరిగా గ్లామర్ షో చేయడం అవసరం.

ఇలా అన్ని కప్పుకొని కూర్చుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావని, సినిమాలలో కాస్త గ్లామర్ షో చేస్తేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి.అయితే ఇలాంటి వాటిని తాను దూరంగా ఉండాలని తన తల్లి గ్లామర్ విషయంలో తనకు వార్నింగ్ ఇచ్చిందంటూ కృతి సనన్ వెల్లడించారు.

Advertisement

ఈ విధంగా సినిమాలలోకి రాకముందు తన తల్లి తనకు అలాంటి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈమె మాత్రం తగ్గేదే అనేలా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి గ్లామర్ షో చేయడం తప్పనిసరి.ఈ క్రమంలోనే కృతి సనన్ సైతం తనదైన శైలిలో సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ప్రభాస్ సరసన నటించిన ఆది పురుష్ సినిమాలో ఈమె సీత పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు