రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కృష్ణంరాజు భార్య...

సినిమా ఇండస్ట్రీ కి రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే సినిమాల్లో రాణించిన ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తూ అక్కడ ఎమ్మెల్యే గా పోటిచేస్తు గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి కూడా రాజకీయ రంగం తో చాలా సనిహిత సంబందం ఉంది ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం తో ఆయన భార్య అయిన శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత దగ్గరైన నియోజకవర్గాలలో ఒకటి అయిన పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్ సభ నుంచి ఆమె పోటీ చేయనున్నారు.ఇక ఆ స్థానం ఎప్పటికీ వైఎస్ఆర్సిపీదే అయినప్పటికీ కూడా ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

తిరుగుబాటు నేతగా పేరు తెచ్చుకున్నాయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఖరిని కూడా తప్పుపడుతూ వస్తున్నారు.వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోటీ కోసం మరొకసారి వైసిపి అగ్రనాయకత్వం రఘురామ కృష్ణంరాజుకు టికెట్( Krishnam Raju ) ఇవ్వాలని అనుకోవట్లేదు.

ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచే రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న రఘురామకు బదులుగా నర్సాపురం లోకసభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఆ ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తోంది.ఎందుకంటే దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి( Shyamala devi ) గారిని రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఈ మేరకు ఆమెతో వైఎస్ఆర్సిపి సంప్రదింపులు సాగుతున్నట్లు.ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి బాధ్యతలను పర్యవేక్షిస్తున్న లోక్సభ సభ్యుడు ఇప్పటికే ఈ సంకేతాలను కూడా పంపించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం శ్యామలాదేవి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.

కానీ మునుముందు ఆమె తన ప్రతిపాదనలను అంగీకరిస్తారని వైసీపీ ఆశిస్తోంది.ఇకపోతే నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు కావడం మరొకవైపు రఘురామ కృష్ణంరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడంతో అక్కడ కొత్త వివాదం నెలకొంది.

2019 నాటికి ఎన్నికలలో 32 ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఘనవిజయం అందుకున్నారు.అనంతరం పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ పైనే విమర్శలు సృష్టిస్తున్నారు.అందుకే ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్యామలాదేవికి నరసాపురం( Narasapuram ) లోక్ సభ టికెట్ ఇవ్వాలని వైసిపి భావిస్తోంది.

కాబట్టి ఈసారి ఆమెని రంగం లోక్ దింపే ప్రయత్నం వైఎస్ఆర్ సిపి పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు