ప్రభాస్‌పై పెదనాన్నకు పీకల్లోతు కోపం..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌పై పెదనాన్న రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు పీకల్లోతు కోపంతో ఉన్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే ఖరాణం పెదనాన్న కృష్ణంరాజు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

అయితే ప్రస్తుతం ఆ పెదనాన్న మాటనే కాదంటూ, తనకు తోచిన విధంగా ప్రభాస్‌ చేసుకుంటూ పోతున్నాడు అని, తన వారసుడిగా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ ఇలా చేయడం కృష్ణం రాజుకు నచ్చడం లేదు అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇంతకు ప్రభాస్‌ కాదంటున్న విషయం ఏంటో తెలుసా.

పెళ్లి.

గత కొంత కాలంగా ప్రభాస్‌ పెళ్లి కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు, సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాని ప్రభాస్‌ పెళ్లికి మాత్రం ఆసక్తిగా లేడు.ఈయన అనుష్కతో ప్రేమలో ఉన్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి.

Advertisement

అందుకే ఇద్దరు త్వరలోనే వివాహం చేసుకుంటారనే వార్తలు వచ్చాయి.సరే అలా అయినా బాగానే ఉంటుందని అంతా భావించారు.

కాని తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరు కూడా ప్రకటించారు.దాంతో ఇద్దరి ప్రేమ వ్యవహారంకు సంబంధించిన పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది.

తాజాగా ప్రభాస్‌ కోసం కుటుంబ సభ్యులు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను అనుకున్నారు.కృష్ణంరాజుకు ఆప్తుడు అయిన ఆ వ్యాపారవేత్త తన కూతురును ఇవ్వడంతో పాటు, భారీ ఎత్తున కట్న కానుకలు ఇస్తాను అంటూ ముందుకు వచ్చాడు.

కృష్ణంరాజు అందుకు ఒప్పుకోవడంతో పాటు, తన రాజకీయ అవసరాలకు కూడా అతడు ఉపయోగపడుతాడనే అభిప్రాయంతో ప్రభాస్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడని సమాచారం అందుతుంది.కాని అందుకు ప్రభాస్‌ నో చెప్పాడట.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!

ప్రస్తుతానికి తాను సినిమాలపైనే దృష్టి పెడుతున్నాను అని, పెళ్లి గురించి ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చాడు.వచ్చే ఏడాది అయినా ఆ అమ్మాయిని చేసుకుంటావా అంటూ కృష్ణం రాజు ప్రశ్నించిన సమయంలో మౌనం వహించాడట.

Advertisement

దాంతో కృష్ణం రాజుకు కోపం వచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.కృష్ణం రాజు ఏ ప్రైవేట్‌ కార్యక్రమంకు వెళ్లినా, ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లినా కూడా మీడియా వారు ప్రభాస్‌ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు.

తాజాగా కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కృష్ణం రాజును ప్రభాస్‌ వివాహం ఎప్పుడు అంటూ మీడియా వారు ప్రశ్నించారు.అందుకు కాస్త కఠినంగా ఆయన సమాధానం చెప్పాడు.

ప్రభాస్‌ ఏం చిన్న పిల్లాడు కాదు, అతడి వివాహం గురించి మనకంటే ఎక్కువ అతడే ఆలోచించుకోవాలి.అతడికి ఆ విషయంపై ఆసక్తి లేనప్పుడు మనం ఏమీ చేయలేం, చెప్పేంత వరకు చెప్తాం అంతకన్నా ఏం చేయగలం అంటూ కస్సుబుస్సులాడుతూ అక్కడి నుండి వెళ్లి పోయాడు.

దీంతో ప్రభాస్‌ విషయంలో కృష్ణం రాజు ఆగ్రహంతో ఉన్నట్లుగా తేలిపోయింది.

తాజా వార్తలు