'కృష్ణ వ్రింద విహారి' టీజర్ వచ్చేసింది.. ఫ్రెష్ గా అనిపిస్తున్న రొమాంటిక్ ట్రాక్..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ప్రస్తుతం నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.లుక్ పరంగా కూడా నాగ సౌర్య అదుర్స్ అనిపిస్తున్నాడు.

ఈయన ప్రెసెంట్ అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా కృష్ణ వ్రింద విహారి.ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది.

ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.

Advertisement

ఇక ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఇటీవలే విడుదల అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన రాగా ఇప్పుడు టీజర్ కూడా రిలీజ్ చేసారు.

ఈ రోజు ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.టీజర్ లో నాగ సౌర్య, షెర్లీసెటియా కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసే సహా ఉద్యోగులుగా కనిపించారు.హీరోయిన్ తన పరిసరాల్లోకి వచ్చిన ప్రతిసారి నాగ శౌర్య తన గుండెలో బెల్ సౌండ్ వింటున్నాడు.

అతడు ఆమెను ఆకట్టు కోవడానికి చేసే ప్రయత్నాలను చాలా బాగా చూపించారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఇద్దరి మధ్య ప్రేమ వికసించిన తర్వాత షెర్లీ తన స్వంత కారణంతో అతనిని తప్పించుకోవడం స్టార్ట్ అవుతుంది.వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.నాగ శౌర్య తొలిసారిగా బ్రాహ్మణా యువకుడి పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

Advertisement

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది.

https://youtu.be/bQtMpo9lmAY

తాజా వార్తలు