ఇంకా ఎన్నాళ్ళు ఈ ఎదురు చూపులు క్రియేటివ్ రాజా?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గత దశాబ్ద కాలంగా సాలిడ్ సక్సెస్ ని దక్కించుకోలేక పోయాడు.

కెరియర్ ఆరంభంలో కృష్ణవంశీ సినిమాలు అంటే మినిమం సక్సెస్ అన్నట్లుగా పేరు ఉండేవి, కానీ ఇప్పుడు కృష్ణ వంశీ సినిమా వస్తుంది అంటే పెద్దగా పట్టింపు లేకుండా ప్రేక్షకుల్లో ఆదరణ లేకుండా ఉంటున్నాయి.

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమా గత నాలుగు సంవత్సరాలుగా నానుతూనే ఉంది.ఇన్ని సంవత్సరాలుగా సినిమా రాకున్నా కూడా జనాల్లో పెద్దగా పట్టింపు ఉన్నట్లుగా అనిపించడం లేదు.

ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో రమ్యకృష్ణ బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక ఇలా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు.షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటించినా కూడా మళ్లీ మళ్లీ రీ షూట్ అంటూ ఏదో ఒకటి షూటింగ్ చేస్తూనే ఉన్నారు.

ఎట్టకేలకు సినిమా పూర్తి అయిందని తెలుస్తోంది.ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తో పాటు ముఖ్య నటీనటులు సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నారు.

Advertisement

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.ఇదే ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ డిసెంబర్ వరకు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఇప్పటి వరకు సినిమా విడుదలకు సంబంధించి హడావుడి మొదలు కాలేదు కనుక ఇప్పటికిప్పుడు సినిమాను విడుదల చేయాలంటే మాత్రం కష్టమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనీసం వచ్చే ఏడాదిలోనైనా ఈ సినిమా విడుదల అవుతుందేమో చూడాలి.మరాఠీ సినిమా నట సామ్రాట్ కి ఈ సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే.

క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్‌ చేయడం పెద్ద విడ్డూరం అంటూ విమర్శలు వస్తున్నాయి.అలాంటిది ఆయన సినిమా కోసం ఇంతగా వెయిట్ చేయాల్సింది వచ్చింది అంటూ సినీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు