కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక నాటకం ద్వారా కృష్ణతో నాకు పరిచయం ఏర్పడిందని అన్నారు.
సాక్షి సినిమా నుంచి కృష్ణగారితో నేను ట్రావెల్ అయ్యానని ఆయన తెలిపారు.
రంగుల రాట్నం సినిమా నుంచి విజయనిర్మల గారికి నేను పని చేశానని ఆయన కామెంట్లు చేశారు.కృష్ణ నటించిన చివరి సినిమా వరకు నా ప్రయాణం ఆయనతో అదే విధంగా కొనసాగిందని ఆయన చెప్పుకొచ్చారు.
కృష్ణగారితో 350 సినిమాలకు నేను పని చేశానని మాధవరావు అన్నారు.నేను కెరీర్ తొలినాళ్లలో నాటకాలకు పని చేశానని ఆయన కామెంట్లు చేశారు.
కృష్ణగారు మంచి కలర్ అని ఆయన మరింత గ్లామర్ గా కనిపించేలా నేను చూసుకునేవాడినని మాధవరావు అన్నారు.కృష్ణగారితో ఉన్న అనుబంధం వల్ల ఆయనతో నేను కొనసాగేవాడినని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
సబ్జెక్ట్ లో పాత్రలకు అనుగుణంగా విగ్గులు తయారు చేసేవాడినని మాధవరావు పేర్కొన్నారు.ఒక సినిమా సమయంలో నాకు ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి వచ్చి కృష్ణగారు కన్నీళ్లు పెట్టుకున్నారని మాధవరావు అన్నారు.
నన్ను స్పెషల్ రూమ్ లో ఉంచాలని సూచించారని ఆయన తెలిపారు.ఒక మేకప్ మ్యాన్ కోసం ఏ హీరో చేయని విధంగా కృష్ణ చేశారని ఆయన కామెంట్లు చేశారు.
నా మీద, నా మేకప్ మీద కృష్ణకు ఎంతో నమ్మకం అని మాధవరావు అన్నారు.నా దగ్గర మందుల కిట్ ఉండేదని కృష్ణగారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే నేను మందులు ఇచ్చేవాడినని ఆయన అన్నారు.కృష్ణగారు నన్ను ఇంట్లో సొంత మనిషిలా చూసుకున్నారని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కృష్ణ మరణం మేకప్ మ్యాన్ మాధవరావును ఎంతగానో బాధ పెట్టగా కృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy