కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.

? వద్దా.? అన్న దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారని తెలుస్తోంది.కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఏజీ అభిప్రాయాన్ని తెలపాలని గతంలో కేంద్రం కోరిన సంగతి తెలిసిందే.

అటార్నీ జనరల్ గా బాధ్యతలు చేపట్టేముందు ఏపీ తరపున న్యాయవాదిగా కేసుల్లో వాదించినందుకు అభిప్రాయం తెలపలేనని వెంకటరమణి వెల్లడించారు.దీంతో అభిప్రాయం కోసం కేంద్రం సదరు ఫైల్ ను సొలిసిటర్ జనరల్ కు పంపింది.

తుషార్ మెహతా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు