55 ఏళ్ళ వైవాహిక జీవితంలో ఆమె నన్ను ఏమి కోరలేదు : హీరో కృష్ణ

హీరో కృష్ణ( hero Krishna ).సూపర్ స్టార్ మహేష్ బాబుకి తండ్రిగానే ఇప్పటి వారికి పరిచయం కానీ మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ గారే.

ఆయన వారసత్వం గా అయిదుగురు పిల్లలు ఉండగా పెద్ద కొడుకు రమేష్ బాబు, చిన్న కొడుకు మహేష్ బాబు అలాగే కూతుర్లు పద్మావతి, మంజుల మరియు ప్రియదర్శిని.అయితే కృష్ణకి రెండు వివాహాలు అయిన సంగతి మన అందరికీ తెలిసిందే మొదటగా ఆయన మరదలు వరుసయ్యే ఇందిరా దేవిని( Indira Devi ) 1962లో పెద్దలు నిశ్చయించగా చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు.

హీరోగాని కదా ముందే కేవలం కృష్ణ డిగ్రీ పూర్తి చేయగానే వీరి వివాహం జరిగింది.దాదాపు 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం కొనసాగింది.

ఇన్నేళ్ల వీరి దాంపత్యంలో కృష్ణను ఇందిరా దేవి ఏ ఒక్క రోజు కూడా ఏది కావాలి అని కోరుకోలేదట.

Advertisement

కృష్ణ తన కుమార్తె మంజుల కు ఆయన బ్రతుకున్న రోజుల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో అనేక వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకున్నారు.ఇందిరా ఏనాడు తనను ఏ కోరిక కోరలేదని చాలామంది తన చుట్టూ ఉన్నవారు ఏదో ఒకటి కావాలనే ఆశతోనే ఉంటారని, కానీ ఒక భార్యగా అన్న ఐదుగురు బిడ్డల తల్లిగా రవ్వంత కోరిక కూడా కోరని భార్యగా ఆమె నాకు ఎప్పటికి గుండెల్లో నిలిచిపోయింది అని తెలిపారు.

నిజానికి కృష్ణ పెళ్లి చేసుకున్న తర్వాత త్వరగా నే సంతానం కూడా కలిగింది.అలాగే కొన్ని సినిమాల్లో నటించగానే విజయ నిర్మలతో ప్రేమ బంధం పెరిగి వారు కూడా వివాహం చేసుకొని ఇందిరతో కాకుండా విజయ నిర్మలతోనే ఆయన జీవితాన్ని చివరి వరకు గడిపారు.

అయినా కూడా ఏ రోజు భర్త పై కోపం చూపించలేదు ఆ మహా ఇల్లాలు.

ఇక ఇందిరా ఉండగానే విజయ నిర్మల ఆ ఇంటి పెద్దగా వివరిస్తూ వచ్చింది.పైగా పిల్లల పెళ్లిళ్ల విషయంలో కూడా ఇందిరా ఎప్పుడూ ముందుగా ఉండి హడావిడి చేసింది కూడా లేదు.ఇప్పటికీ కృష్ణ కుమార్తెల పెళ్లిల్ల వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అందులో విజయనిర్మల హడావిడి మాత్రమే ఎక్కువగా ఉంటుంది.అంత నిరాడంబరత ఆమె సొంతం.

Advertisement

తప్పు చేసిన ఏనాడు కోపం కూడా చూపించని వ్యక్తిగా ఇందిరపై కృష్ణ కి ఎప్పుడు ఒక గౌరవం ఉంటుందట.ఇక విజయ నిర్మల తో పెళ్లి జరిగినప్పటికీ ఇందిరతోనేఆయన సంసార జీవితం కొనసాగింది విజయ నిర్మలతో పెళ్లి తర్వాత ఇందిరా దేవికి మరియు కృష్ణకు సంతానం కూడా కలిగింది.

తాజా వార్తలు