Kota Srinivasa Rao NTR : తారక్ యాక్టింగ్ చూసి షాక్ అయినా కోట..ఏమన్నాడో తెలుసా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) మొదటి వరుసలో ఉంటాడటంలో సందేహం లేదు.

డైలాగులు చెప్పడంలో, డాన్స్ చేయడంలో, ఫైట్లు ఇరగదీయ్యడంలో, నటించడంలో ఎన్టీఆర్ కి బహుశా ఎవరూ పోటీ రారేమో.

ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.అతడి నటనకు చాలామంది ఫారినర్స్ కూడా ఫిదా అయిపోయారు.

క్రిటిక్స్ కూడా అతడి పై ప్రశంసల వర్షం కురిపించారు.తారక్‌ ఎంత కష్టమైన డైలాగునైనా సింగిల్ టేక్ లో అద్భుతంగా చెప్పగలడు.

అంత మెమొరీ పవర్ అతడి సొంతం అయితే ఎన్టీఆర్ లోని ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని రాఖీ మూవీ( Rakhi Movie )లో డైరెక్టర్ కృష్ణవంశీ బాగా వాడుకున్నాడు.

Advertisement

ఈ సినిమాలో రైల్వే డిపార్ట్‌మెంట్‌ గురించి ఒకటిన్నర నిమిషాల డైలాగ్ ఒకటి ఉంటుంది.అందులో నెంబర్స్ కూడా ఉంటాయి.ఈ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పడం అంటే దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు.

కానీ ఎన్టీఆర్ మెమొరీ పవర్ వల్ల దానిని ఈజీగా చెప్పగలిగాడు.ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) కూడా నటించాడు.

అయితే ఎన్టీఆర్ ఆ డైలాగును ఒక్క పొల్లు పోకుండా చాలా ఎమోషన్ తో పూర్తిగా చెప్పడం విని ఆయన ముగ్ధుడయ్యాడట.తారక్ లో ఇలాంటి ఒక స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసుకుని కోట శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడట.

ఇక తారక్‌ ఈ కష్టతరమైన డైలాగ్ చెప్పాక సెట్ లోని అందరూ చప్పట్లు కొడుతూ అతడి టాలెంటును మెచ్చుకున్నారట.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

తరువాత కోట శ్రీనివాసరావు "మళ్లీ మీ తాత పుట్టాడు రా అంటూ" తారక్ పై పొగడ్తల వర్షం కురిపించాడట.రాఖీ సినిమానే కాకుండా దమ్ము, బృందావనం( Brindavanam ), రామయ్య వస్తావయ్య, టెంపర్ వంటి సినిమాల్లో కూడా తారక్ తో కలిసి కోట శ్రీనివాసరావు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara ) చేస్తున్నాడు.

Advertisement

అందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది హిట్ అయితే రాజమౌళితో సినిమా తర్వాత హిట్ కొట్టిన తొలి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తాడు.జాన్వీ కపూర్ కి తెలుగులో వరుస అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.