కొండా ఆధ్వర్యంలో రేవంత్ కొత్త పార్టీ ?  ఈటెల అందులోకే ? 

కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకునేలా అక్కడి రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  తనకు తప్పనిసరిగా పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ విషయం సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి తనకు దక్కడం కష్టమే అనే అభిప్రాయం రేవంత్ లో ఉంది.అయినా ఆ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే, తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ద్వారా కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

కొత్త పార్టీ ఏర్పాట్లు పూర్తి అయిన తరువాత కాంగ్రెస్ లో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోతే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేయబోయే పార్టీలో రేవంత్ చేరి, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆ పార్టీని తీర్చిదిద్దుతారనే ప్రచారం జరుగుతోంది.తాజాగా టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటెల రాజేందర్ వ్యవహారము ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది.

ఆయన త్వరలోనే టిఆర్ఎస్ కు రాజీనామా చేయడం గానీ,  లేక ఆ పార్టీనే ఆయన ను తొలగించడం కానీ ఏదో ఒకటి జరిగే అవకాశం కనిపిస్తోంది.ఈటెల బయటకు వస్తే తమ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ మేరకు ఆయన తో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.

Advertisement
Konda Vishweswar Reddy New Party Under Rewanth Is Etela Rajender Who Is About To

అలాగే టిఆర్ఎస్ లో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలకు కెసిఆర్, కేటీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని, వారు పార్టీ స్థాపించిన తర్వాత అందులో చేరే అవకాశం ఉందని విశ్వేశ్వర రెడ్డి చెబుతున్నారు.  అలాగే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ లు టీఆర్ఎస్ పై పోరాటం చేసే స్థాయిలో లేవని అందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని,

Konda Vishweswar Reddy New Party Under Rewanth Is Etela Rajender Who Is About To

దీనికి రేవంత్ మద్దతు కూడా ఉంది అంటూ విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నారు.అంతేకాదు త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు ఈశ్వర్ రెడ్డి చెబుతుండడంతో ఈటెలను పార్టీలో చేర్చుకుని టిఆర్ఎస్ పై ఆయనను గురు పెట్టే వ్యూహం పన్నుతున్నట్లు గా అర్థం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు