టాస్ గెలిచిన కోల్‌కతా .. పంజాబ్ దశ తిరిగేనా ?

టాస్ గెలిచిన కోల్‌కతా .పంజాబ్ దశ తిరిగేనా ? ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 .

లో భాగంగా నేడు 24వ మ్యాచ్ జరుగుతోంది.అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ , కోల్ ‌కతా నైట్ రైడర్స్ ఈ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఇక ఈ మ్యాచ్ లో భాగంగా .టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముందుగా బ్యాటింగ్‌ కు ఎంచుకుంది.ఇకపోతే , ఇరు జట్లలో ఒకే ఒక్క మార్పు చేశారు.

పంజాబ్ జట్టులోకి జోర్డాన్ వచ్చాడు.ఈ మ్యాచ్‌లో పేసర్ కాట్రెల్‌ ను పక్కనబెట్టారు.

ఇక కేకేఆర్ జట్టులో శివం మావి స్థానంలో ప్రసిద్ధ్ క్రిష్ణ జట్టులోకి తీసుకున్నారు.ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ లు ఆడింది.

Advertisement

ఇందులో ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది.మిగిలిన ఐదింటిలో ఓటమి పాలయింది.

ఇక కేకేఆర్ గత మ్యాచ్ లో బలమైన చెన్నై ని మట్టి కరిపించి దృఢమైన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతుంది.జట్ల వివరాలు: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Playing XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంగ్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్ ( వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ముజీవ్ రహమాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.కోల్ ‌కతా నైట్ రైడర్స్ (Playing XI): రాహుల్ త్రిపాఠి, శుభమాన్ గిల్, నితీష్ రానా, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, అండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.

Advertisement

తాజా వార్తలు