సుప్రీంలో కోదాడ ఎమ్మెల్యేకు చుక్కెదురు...!

సూర్యాపేట జిల్లా:గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన బొల్లం మల్లయ్య యాదవ్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన తన అఫిడవిట్‌లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆస్తుల వివరాలను తప్పుడుగా చూపారంటూ ఆయన ఎన్నికను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో కేసు వేశారు.

ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ వివాదంలో హైకోర్టులో సాగుతున్న కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు కోరుతూ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Kodada MLA Will Be Dropped In The Supreme ,Bollam Mallaiah Yadav ,Assembly Elect
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

తాజా వార్తలు