నడిరోడ్డుపై కాలేజీ కి వెళ్తున్న బాలికలను అసభ్యంగా తాకిన హోమ్ గార్డు.! ఫేస్బుక్ లో వీడియో వైరల్ అవ్వడంతో.?

ప్రజలను కాపాడాల్సిన పోలీసు పదవిలో ఉండి.మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన ఓ హోమ్ గార్డు, విధులు నిర్వహిస్తూ, తనలోని కామ ప్రకోపాన్ని చూపించాడు.

మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు.ఈ ఘటన కొచ్చిలోని తివారాలో చోటు చేసుకుంది.

అక్కడే ఉన్న ఒక సామాన్యుడు వీడియోని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాలలోకి వెళ్తే.

ఓ చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే హోమ్ గార్డు, అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించగా, అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

watch video:

ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విషయం తెలుసుకున్న సీటి పోలీస్‌ కమిషనర్‌ అతడిపై సీరియస్‌ అయ్యారు.

Advertisement

శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు