Men Waist Thread : మగవాళ్ళు మొలతాడును ఎందుకు ధరిస్తారు.. ధరించకపోతే ఏమవుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎన్నో ఆచారాలను పాటిస్తూ ఉంటాము.అలాగే వివాహం తర్వాత మహిళలు చేతులకు గాజులు వేసుకుంటారు.

అలాగే మెట్టెలు కూడా ధరిస్తారు.నుదుటిన కచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు.

అలాగే మంగళవారం గోర్లను, వెంట్రుకలను కట్ చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే మగవాళ్ళు మొలతాడు( Sacred Waist Thread ) కచ్చితంగా కట్టుకోవాలని నియమం కూడా ఉంది.

దీన్నే ప్రస్తుత సమాజంలో కూడా పాటిస్తున్నారు.చిన్న పిల్లలకు కూడా మొలతాడును కచ్చితంగా కడతారు.

Advertisement

పాతబడిన తర్వాత కొత్తది కట్టి పాత మొలతాడు ను తీసేస్తుంటారు.కానీ మొలతాడు లేకుండా మాత్రం అసలు ఉండరు.

ఇలా ఉండకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే బెల్టులు అందుబాటులో లేని కాలంలో పంచలు, లుంగీలు, పాయింట్లు జారిపోకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించేవారు.అయితే వీటిని సపరేట్ గా వీటి కోసమే ఉపయోగించేవారు మాత్రం కాదు.

ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం( Jyotishya Shastram ) ప్రకారం మొలతాడు లేకుండా ఉండడం అంటే చనిపోవడమే అని అర్థం.చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడు తీసేస్తారని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అందుకే మొలతాడు ను ఎప్పుడూ నడుముకు ఉండేలా చూస్తారు.అలాగే పూర్వకాలంలో డాక్టర్లు, హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉండేవి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025

కాబట్టి పాము కరిస్తే మొలతాడును తెంపి పాము కుట్టిన దగ్గర కట్టి విషయాన్ని తీసేసేవారని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు.

Advertisement

బ్లాక్ లేదా ఎర్రని మొలతాడును ఎక్కువగా ఉపయోగిస్తారు.అలాగే మొలతాడును మగవారికి( Men ) దిష్టి తగలకుండా చేస్తుంది.ఇది చెడు కంటి నుంచి రక్షిస్తుందని చెబుతారు.

అందుకే మొలతాడు ఎప్పటి నుంచో కట్టుకునే సంప్రదాయం ఉంది.అది నేటికీ కూడా కొనసాగుతూ ఉంది.

ఏదేమైనా మొలతాడు మగవారు మాత్రమే కట్టుకోవాలి.కానీ దీన్ని ఆడవాళ్లు కూడా కట్టుకోవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలామంది చేతికి లేదా కాలికి నల్లదారన్నీ( Black Thread ) కట్టుకుంటూ ఉన్నారు.ఎందుకంటే ఇది కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది.

నల్ల దారం దుష్టశక్తులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని నమ్ముతారు.సైన్స్ ప్రకారం మొలతాడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.

తాజా వార్తలు