నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలి..: సీఎం కేసీఆర్

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ నేతలు వస్తారు, అనేక మాటలు చెప్తారని కేసీఆర్ మండిపడ్డారు.నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలన్నారు.

ఆగమాగమైతే పరిస్థితులు తారుమారు అవుతాయన్న కేసీఆర్ తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని తెలిపారు.గతంలో కారు చీకట్లు తప్ప ఏం లేదన్నారు.

వలసలు వెళ్లి బతకాల్సిన పరిస్థితులు ఉండేవన్న కేసీఆర్ సమైఖ్య పాలనలో నిజాంసాగర్ ఎండిపోయిందని పేర్కొన్నారు.అయితే ఇప్పుడు కాళేశ్వరం నీటితో నిజాంసాగర్ నిండుగా ఉంటోందన్నారు.

Advertisement

తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామన్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు.తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేసి నష్టం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు