బ్లాక్ హెడ్స్ రిమూవర్ తయారి గురించి తెలుసుకుందామా ?

బ్లాక్ హెడ్స్ వచ్చాయంటే వాటిని వదిలించుకోవటం చాలా కష్టమని అందరు భావిస్తారు.

బ్లాక్ హెడ్స్ రాగానే మార్కెట్ లో దొరికే అనేక రకాల స్క్రబ్స్ ఉపయోగిస్తూ ఉంటారు.

అవి కొంతవరకు పనిచేసిన వాటి కారణంగా కొన్ని రకాల సమస్యలు,దుష్ప్రభావాలు కలుగుతాయి.బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవడానికి మార్కెట్ లో లభ్యం అయ్యే మెటల్ బ్లాక్ హెడ్ ఎక్స్ట్రాక్టర్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

Know How To Make Blakhead Remover At Home Details, Blakhead Remover, Cinnamon ,h

దీని వలన కొంచెం నొప్పి వచ్చే అవకాశం ఉంది.అయితే ఇంటిలో తయారుచేసుకొనే బ్లాక్ హెడ్స్ రిమూవర్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

అంతేకాక రిమూవర్ తయారీకి ఉపయోగించే పదార్ధాల కారణంగా చర్మంలో తేమ, నిగారింపు రావటమే కాకుండా ప్రకాశవంతంగా మారుతుంది.ఈ రిమూవర్ తయారికి కేవలం రెండే రెండు పదార్ధాలు సరిపోతాయి.

Advertisement

అవి కూడా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.తేనే, దాల్చిన చెక్క పొడిని ఉపయోగించి ఈ బ్లాక్ హెడ్స్ రిమూవర్ ని తయారుచేసుకోవాలి.

ఒక స్పూన్ తేనెలో చిటికెడు దాల్చినచెక్క పొడిని కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసి దాని మీద కాటన్ స్ట్రిప్ ని అంటించి 5 నిముషాలు అయ్యాక లాగితే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు