కళ్ల కింద నలుపు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో కామన్‌గా వేధించే సమస్య ఇది.ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి, హార్మోన్ ఛేంజస్, స్మార్ట్ ఫోన్లను అధికంగా వినియోగించడం, గంటలు తరబడి ల్యాప్టాప్స్ ముందు కూర్చుని పని చేయడం వంటి రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నలుపు రంగు వలయాలు ఏర్పడతాయి.ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదుముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే కళ్ల కింద నలుపును వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను వాడితే గనుక వారం రోజుల్లోనే కళ్ల కింద నలుపు మటుమాయం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచుర్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక కివి పండు తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మెత్తగా స్మాష్ చేసి జ్యూష్ను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక బంగాళదుంప తీసుకుని పీల్ తొలగించి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్ సీడ్ జెల్, వన్ టేబుల్ స్పూన్ బంగాళదుంప జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల కివి ఫ్రూట్ జ్యూస్, వన్ ఫిష్ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో ఐదారు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.
ఈ క్రిమ్ను కళ్ల కింద అప్లై చేసి.స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే గనుక కేవలం వారం రోజుల్లోనే కళ్ల కింద నలుపు తగ్గు ముఖం పడుతుంది.