పాలీహౌస్‌కు ప్రత్యామ్నాయం నెట్ హౌస్‌.. వివ‌రాలివే!

వ్యవసాయ శాస్త్రవేత్తలు పాలీహౌస్ సాంకేతికతను మ‌రింత‌గా అభివృద్ధి చేశారు.పాలీహౌస్ ఖర్చు రైతుల తోటపని ఖర్చును పెంచుతుంది.

అటువంటి పరిస్థితిలో పాలీహౌస్‌కు ప్రత్యామ్నాయంగా తాగాజా రూపొందించిన‌ చౌకైన నెట్‌హౌస్ మార‌నుంది.ఇందులో రైతులు ఒక సీజన్‌లో 4 పంటలు పండించవచ్చు.

ఈ నెట్ హౌస్‌ను కేవీకే, ఐసీఏఆర్‌-సీఏజెడ్‌ఆర్ జోధ్‌పూర్ అభివృద్ధి చేసింది.ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలియ‌జేశారు.

KVK, ICAR-CAZRI జోధ్‌పూర్ అభివృద్ధి చేసిన నెట్ హౌస్ సమాచారాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న కైలాష్ చౌదరి.రైతులు ఈ నెట్ హౌస్‌ను కేవలం 1.5 లక్షల రూపాయల ఖర్చుతో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ నెట్ హౌస్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఒక రైతు సంవత్సరంలో నాలుగు పంటల టమోటా, చెర్రీ టమోటా, దోసకాయ మరియు రంగురంగుల క్యాప్సికమ్‌ను పండిచ‌వ‌చ్చ‌ని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు.

Advertisement

నెట్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలోనే రైతులు దానికి అయిన‌ ఖర్చులను తిరిగి పొంద‌వ‌చ్చ‌ని ఆయన చెప్పారు.నెట్ హౌస్ ద్వారా రైతులు 5 సంవత్సరాల పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.అదే సమయంలో నెట్ హౌస్ లో 2.50 మీటర్ల ఎత్తు వరకు వైర్ పెట్టడం ద్వారా మొక్కలను స్థిరీకరించవచ్చు.ఈ నెట్ హౌస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఖర్చు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు