కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహం: మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కోసం కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని చెప్పారు.

కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహమన్న ఆమె.కేంద్రం గిరిజనులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.గిరిజన రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

కానీ ఆ విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు.కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

కేంద్రం తక్షణమే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.దీనికోసం ప్రజలు రోడ్లపైకి రాకముందే స్పందించాలని సూచించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)