క్షమాపణ చెప్పే ధైర్యం కిషన్ రెడ్డికి లేదు..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మెడికల్ కాలేజీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.తెలంగాణకు తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరు చేశారన్నది అవాస్తవమని చెప్పారు.

కిషన్ రెడ్డి లాంటి దురుదృష్టకరమైన కేంద్రమంత్రిని చూడలేదని ఆయన విమర్శించారు.క్షమాపణ చెప్పే ధైర్యం కూడా కిషన్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామన్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ కు తరలించారని ఆరోపించారు.మరోసారి హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు.

తెలంగాణకు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు