ఎట్టకేలకు లుక్ మార్చిన కిరణ్ అబ్బవరం..

రాజావారు రాణిగారు సినిమా( Rajavaru Ranigaru movie ) తో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఆ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు ఆ మూవీ మంచి హిట్ అయింది.

ఈ సినిమా ని థియేటర్లో జనాలు పెద్దగా చూడలేదు కానీ ఓటీటీల్లో ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేసింది.

దీంతో కిరణ్ కి మంచి ఆఫర్లు వచ్చాయి.ఈ ఒక్క సినిమా వల్ల కిరణ్ అబ్బవరం కి దాదాపు 10 ఆఫర్లు వచ్చాయి.

అటు తర్వాత చేసిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ సినిమా( SR Kalyanamandapam movie ) కమర్షియల్ సక్సెస్ అందుకుంది.అందువల్ల ఇతని సినిమాకి డీసెంట్ మార్కెట్ ఏర్పడింది.రూ.5 లేదా రూ.6 కోట్లు పెట్టి కిరణ్ తో సినిమా తీసి క్యాష్ చేసుకోవచ్చు అని చాలా మంది నిర్మాతలు బయల్దేరారు.ఈ క్రమంలో వచ్చిన ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సినిమాలు బాగానే ఆడాయి.

కానీ ఒక్కటే కంప్లైంట్.కిరణ్ లుక్స్ కానీ పెర్ఫార్మన్స్ కానీ మార్చడం లేదు అని.!

Advertisement

దాదాపు సింగిల్ ఎక్స్ప్రెషన్, ఒక నవ్వుతోనే అతను 7 సినిమాలు కంప్లీట్ చేసేశాడు.ప్రస్తుతం అతను ‘రూల్స్ రంజన్’( Rules Ranjan movie ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం అతను కొత్త లుక్స్ లో కనిపిస్తున్నాడు.

కిరణ్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే స్టైలిష్ లుక్ లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు.మరి పెర్ఫార్మన్స్ విషయంలో కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే .అతని ఇమేజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.అలాగే ఈయనకి ఫ్యాన్స్ కూడా రోజు రోజు కు బాగా పెరుగుతున్నారు.

అందుకే ఈయన రాబోయే సినిమాలా మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇంకా ఇండస్ట్రీ లో హీరోగా అతనికి మంచి లైఫ్ ఉంటుందని చాలా మంది సినీ పెద్దలు కూడా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు