ఐదేళ్ల లెక్కతో అదరగొట్టిన కియారా.. ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో ఎంఎస్ ధోనీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కియారా అద్వానీ అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.

ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటి మంచి అవకాశాలను చేజిక్కించుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామ అనే సినిమాల్లో నటించినా అమ్మడికి తెలుగులో పెద్ద గుర్తింపు రాలేదు.దీంతో కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డీ రీమేక్ మూవీ కబీర్ సింగ్‌ను బాలీవుడ్‌లో నటించి తన సత్తా చాటుకుంది ఈ బ్యూటీ.

కబీర్ సింగ్ సినిమాలో హాట్ సీన్లతో పాటు నటనతోనూ రెచ్చిపోయిన కియారా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో వరుసగా ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది.అయితే ఈ బ్యూటీ ఎంత బిజీగా ఉందంటే, గత 5 ఏళ్లలో ఈ చిన్నది ఏకంగా రూ.30 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది.కేవలం సినిమాల్లోనే కాకుండా పలు యాడ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న కియారా మిగతా హీరోయిన్లు కుళ్లుకునేలా చేస్తోంది.

వరుసగా చిత్రాలను చేస్తూనే, వెబ్ సీరీస్‌లతో కూడా దూసుకెళుతున్న కియారాను చూసి ఔరా అంటున్నారు ప్రేక్షకులు.ఏదేమైనా ఈ బ్యూటీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Advertisement

తాజా వార్తలు