నైట్ స్పెషల్ గా ఉందంటూ కియారా అద్వానీ పోస్ట్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఇప్పుడు ఏమాత్రం మొహమాటం పడకుండా తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకుంటున్నారు.ఒకప్పుడు మాత్రం ఏ విషయమైన రహస్యంగా ఉంచేవాళ్లు.

బయటపడకుండా జాగ్రత్త పడేవాళ్లు.కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.

ఎవరితో డేటింగ్ చేసినా కూడా బయటికి చెప్పేసుకుంటున్నారు.ఇక సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండటంతో తమ వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు.

అయితే తాజాగా కియారా అద్వానీ కూడా ఒక విషయాన్ని బయట పెట్టింది.ఇంతకూ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ కియారా అద్వానీ.ఈ బ్యూటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ మనసులను దోచుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమే.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రేంజ్ హైలో ఉంది.

అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంఎస్ ధోని సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

ఇందులో కూడా మంచి సక్సెస్ అందుకుంది.దాంతో టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

Advertisement

ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అభిమానులను మార్చుకుంది.

అలా చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకుని టాప్ పొజిషన్ లో స్థానం దక్కించుకుంది.ఇక సోషల్  మీడియాలో మాత్రం తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది.ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.

అయితే ఈ బ్యూటీ ఇటీవలే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.గత కొంతకాలం నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తమ కుటుంబ సమ్మక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకుంది.

సినీ ప్రముఖులతో పాటు పెద్దపెద్ద వి ఐ పి లు కూడా వచ్చారు.ఇక సోషల్ మీడియా వేదికగా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ప్రస్తుతం తన కొత్త జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంది.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో తన భర్తతో డాన్స్ చేస్తున్నట్లు కొన్ని స్టిల్స్ కనిపించాయి.ఇక అతనితో కొన్ని ఫోటోలు కూడా దిగింది.

ఇక ఆ ఫోటోలో తను చాలా సంతోషంగా కనిపించింది.ఇక ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.నిజంగా స్పెషల్ గా ఉంది అంటూ డాన్స్ చేస్తున్న ఎమోజీలతో పంచుకుంది.

అంటే తన భర్తతో బాగా డాన్స్ చేసినట్లు అనిపించింది.అయితే ఆ క్యాప్షన్ చూసి కొందరు నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

డాన్స్ మాత్రమే ఉందా ఇంకేమైనా ఉందా అంటూ డబల్ మీనింగ్ వచ్చేలా డైలాగులు కొట్టారు.మరి కొంతమంది తమ ఫస్ట్ నైట్ గురించి కామెంట్లు పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంది.

తాజా వార్తలు