పెళ్లిపై కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ వైరల్ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఈమె సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది.ఇకపోతే ఈ ముద్దుగుమ్మను మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

అలాగే బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.ప్రస్తుతం ఆమె చేతిలో పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు పాన్‌ ఇండియా మూవీ కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె నటించిన భూల్ భులయ్యా 2 చిత్రం విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇక త్వరలోనే తన తదుపరి మూవీ జగ్‌ జగ్‌ జియో చిత్రం కూడా రిలీజ్‌ కాబోతోంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగానే ఇటీవల సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసింది.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కియారా వరుణ్‌ ధావన్‌ సరసన నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో కియారాకు పెళ్లిపై ప్రశ్న ఎదురయ్యిందిం పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్‌అవుతారని ఓ విలేకర్ ప్రశ్నించగా దీనిపై కియారా స్పందిస్తూ.పెళ్లి చేసుకోకపోయిన నేను బాగానే సెటిల్‌ అయ్యాను.సెటిల్‌ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం నేను పని చేస్తున్నా.బాగా సంపాదిస్తున్నా.

హ్యాపీగా ఉన్నాను.సెటిల్‌ అవ్వడమంటే ఇదే కదా అంటూ కియారా సమాధానం ఇచ్చింది.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?

కాగా బాలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు