బాలీవుడ్‌కు పారిపోయిన ఖైదీ

తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కార్తీ యాక్టింగ్‌కు జనాలు నీరాజనాలు పలికారు.

ముఖ్యంగా ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా కార్తీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ తన సత్తా చాటింది.

కాగా బాలీవడ్ నిర్మాతలు ఈ సినిమాపై కన్నేశారు.దీంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

Advertisement

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరనే అంశాలను మాత్రం ప్రకటించలేదు.

తమిళంతో పాటు తెలుగులోనూ కార్తీకి అదిరిపోయే హిట్‌ను అందించిన ఖైదీ, ఇప్పుడు బాలీవుడ్ జనాలను అలరించేందుకు వెళుతున్నాడు.మరి అక్కడ ఖైదీ ఎలాంటి హిట్ కొడతాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Advertisement

తాజా వార్తలు