KGF యశ్ అసలు పేరు ఏంటో తెలుసా..?

కె.జి.ఎఫ్ సినిమా తో సంచలనం సృష్టించిన యశ్ ఆ సినిమాతో సత్తా చాటాడు.

పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా లేటెస్ట్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2తో వచ్చాడు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉన్నాడు యశ్.ఈ క్రమంలో యశ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.రాకింగ్ స్టార్ యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ అట.అయితే జోతిష్యులు చెప్పడంతో తన పేరుని యశ్ గా మార్చుకున్నాడట మన యాక్షన్ హీరో.యశ్ గా ఒక్క సినిమాతోనే నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ మాస్ హీరో.

కె.జి.ఎఫ్ 1తోనే అదరగొట్టగా లేటెస్ట్ గా వచ్చిన చాప్టర్ 2తో మరింత రఫ్ఫాడించాడు.పార్ట్ 2లో యశ్ మేనరిజం, స్టైల్ అరుపులు పెట్టించాయి.

మాస్ ఆడియెన్స్ కి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సీటీమార్ కొట్టించే సినిమాగా వస్తుందని చెప్పొచ్చు.కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లతో సౌత్ లోనే కాదు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యశ్.రానున్న రోజుల్లో అతని నుండి ఇలాంటి మరెన్నో బ్లాక్ బస్టర్స్ వస్తాయని చెప్పొచ్చు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు