ఇలా చేస్తే ఆమెను మర్చిపోవడం పక్కా..!

కె.జి.ఎఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty ).

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ నెక్స్ట్ సినిమాల విషయంలో తప్పులు చేస్తుంది.కోలీవుడ్ ( Kollywood ) లో విక్రం సరసన కోబ్రా( Cobra ) సినిమా చేసిన అమ్మడు ఆ సినిమా ఫ్లాప్ అవడంతో సైలెంట్ అయ్యింది.

కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి సినిమాల ఎంపికలో దూకుడు చూపించట్లేదు.మరీ ముఖ్యంగా తెలుగు ఆఫర్లు వస్తున్నా కూడా అమ్మడు ఏవేవో కారణాలు చెప్పి కాదనేస్తుందట.

కొన్ని సినిమాలు కథలు నచ్చక మరికొన్ని సినిమాలు రెమ్యునరేషన్ నచ్చక ఇలా ఏదో ఒక రీజన్ తో అమ్మడు సినిమాలు స్కిప్ చేస్తుంది.అయితే ఇలా చేస్తే శ్రీనిధిని ఆడియన్స్ మర్చిపోవడం పక్కా అని చెప్పొచ్చు.హిట్టో ఫ్లాపో ఏదో ఒక సినిమా చేస్తూ ఉంటే ప్రేక్షకుల నుంచి ఫాలోయింగ్ పెంచుకునే ఛాన్స్ ఉంది.

అలా కాకుండా చేస్తే మాత్రం శ్రీనిధి ఇక కెరీర్ ముగిసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.శ్రీనిధి శెట్టి కెరీర్ విషయంలో ఇంత కేర్ లెస్ గా ఉండటం ఆమెను చాలా ఇబ్బందుల్లో పడేస్తుందని చెప్పొచ్చు.

Advertisement
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo