పొత్తా ? మద్దత్తా ? తెలంగాణలో పోటీపై జనసేన బిజెపి నేతల కీలక చర్చలు !

ఎన్డీఏలో అధికారికంగా భాగస్వామీ నని జనసేనా( Janasena ) ఎంతగా చెప్పుకున్నా ఈ రెండు పార్టీలు కలిసి చేసిన ఉమ్మడి ప్రయాణం ఎక్కడా కనిపించదు.

ఎందుకంటే తెలుగు నాట రాజకీయ పరిస్థితులను ఈ రెండు పార్టీలు చూస్తున్న దృకోణాలు వేరుగా ఉండడం తో ఉమ్మడి కార్యాచరణ అన్నది సాధ్య పడడం లేదు.

జనసేన టిడిపి అనుకూల దొరణి తో ఉంటే బజాపా సమయాన దూరం అని చెప్తూనే కొంత వైసీపీ ( YCP ) అనుకూల దొరణి తో ప్రయాణిస్తుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణం లో ఇప్పటివరకూ బిజెపి( BJP ) మాత్రమే లాభ పడిందని చెప్పాలి.

ఎందుకంటే తెలంగాణ లో జిహెచ్ఎంసి ఎన్నికల దగ్గర్నుంచి ఆంధ్ర లో ఉప ఎన్నికల వరకూ జనసేన కేవలం బ్యాక్ సీట్ లో కూర్చుని మద్దతు ఇవ్వటమే తప్ప బిజెపి నుంచి మద్దతు తీసుకోనే పరిస్తితి రాలేదు.

అదే ఈ రెండు పార్టీల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణ కూడా కలిగించింది అని చెప్పవచ్చు.ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నామని జనసేనకు ప్రకటించిన దగ్గరనుంచి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లో మరింత దూరం పెరిగింది అని తెలుస్తుంది.అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో( Telangana Elections ) 32 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన అధ్యక్షుడిని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు మరియు అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) మరో కీలక నేత అయిన లక్ష్మణ్( Lakshman ) తో వెళ్ళి కలవడంతో ఇప్పుడు మరోసారి జనసేనను బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టడానికి బిజేపి ప్రయతింస్తుందా అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

Advertisement

అయితే తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రభావం చూపించాలని కోరుకుంటున్న జనసేన గత కొంత కాలం గా కేవలం మద్దతు ఇచ్చి ఊరుకుంది తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగలేదు.ఒక రాజకీయ పార్టీ ఎదుగుదల ఆ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసి ఎన్నికల బరిలో దిగినప్పుడే పెరుగుతుంది.

తద్వారా ప్రజల అభిమానం మెల్లగా చూరగొని ఒక నాటికి క్రియాశీలక పాత్రకు దగ్గరవుతుంది.కానీ పొత్తు ధర్మం పేరుతో ప్రతిసారి మద్దతు ఇచ్చి ఊరుకుంటే పార్టీకి రాజకీయ ప్రయోజనం కలగదని భావిస్తున్న తెలంగాణ జనసేన నాయకులు ఈసారి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది .ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ పూర్తిగా అంతర్దనమయ్యే అవకాశం ఉందని హేచ్చరించడంతో ఈసారి తాము కూడా పోటీ చేసే విధంగా బిజెపిని ఒప్పించడానికి జనసేనా ని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.మరో రెండు రోజుల్లో పోటీపై నిర్ణయం ప్రకటిస్తానని నాయకులతో పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో ఈసారి కచ్చితంగా జనసేన గుర్తు తెలంగాణ ఎన్నికల బ్యాలెట్ లో కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు