Telangana Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..!!

తెలంగాణ ఇంటర్ బోర్డు( Telangana Inter Board ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంటర్ పరీక్షలకు( inter exams ) హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి నిమిషం నిబంధన ఎత్తివేయటం జరిగింది.

ఇప్పటివరకు ఇంటర్ పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించని పరిస్థితి.దీంతో పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేని కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో.

ముందస్తుగా రావడమో లేదా ఐదు నిమిషాల వరకు అవకాశం కల్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇవాళ లేఖ విడుదల చేయడం జరిగింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.విద్యార్థులు ఉదయం 8:45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.తాజా ఉత్తర్వులతో ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వస్తున్న విద్యార్థులు ఐదు నిమిషాల రాయితీని అందుకుంటారు.

Advertisement

ఈ క్రమంలో విద్యార్థులు కొన్ని కారణాల వల్ల పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వస్తే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ అందించాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ అధికారులు సంబంధిత జిల్లా అధికారులకు, సెంటర్ మేనేజర్‌లకు సూచించారు.నిన్ననే పరీక్షకు ఒక నిమిషం ఆలస్యం కావడంతో పరీక్షా కేంద్రానికి అధికారులు అనుమతించకపోవడంతో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

ఇటువంటి ఘటనలు ఎక్కువవుతున్న క్రమంలో ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వస్తున్న విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ తెలంగాణ ఇంటర్ బోర్డు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు