ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

మే 13వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.

ఏపీలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.దీంతో ఏపీలో ( AP ) ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో కంటే రెండు శాతం ఓటింగ్ ఎక్కువగా నమోదు కావటంతో.అధికారం మారే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు.

మరోపక్క గ్రామాలలో అదేవిధంగా మహిళా ఓటర్లు అత్యధికంగా.పోలింగ్ లో పాల్గొనడంతో.

Advertisement
Key Comments Of Kishan Reddy Saying That NDA Alliance Will Win In AP Details, ND

తామే అధికారంలోకి వస్తామని వైసీపీ ( YCP ) నాయకులు చెబుతున్నారు.

Key Comments Of Kishan Reddy Saying That Nda Alliance Will Win In Ap Details, Nd

ఏపీలో అధికారం చేపట్టే విషయంలో ఎవరికివారు తామే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వెలువడనున్నాయి.ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కచ్చితంగా ఏపీలో వందకి 100% ఎన్డీఏ కూటమిదే( NDA Alliance ) విజయం అని స్పష్టం చేయడం జరిగింది.తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదు.

ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది.రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేశాయి.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !

అయినా గాని ప్రజలు బీజేపీని నమ్మి ఓట్లు వేశారు.రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లు సాధిస్తాం అని కిషన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు