ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గిట్టనివాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా అభివృద్ధి జరగలేదని చెప్పారు.

గ్రోత్ రేటులో దేశానికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు.మీ బిడ్డ చేస్తున్న అప్పుల గ్రోత్ రేట్ గతం కన్నా తక్కువేనన్నారు.

జగన్ పాలనలో బటన్ లు మాత్రమే ఉన్నాయని, లంచాలు, వివక్ష లేదని చెప్పారు.గత ముసలాయన ప్రభుత్వంలో గజదొంగల ముఠా ఉండేదని పేర్కొన్నారు.

గజ దొంగలకు దుష్టచతుష్టయం అనే పేరుందన్న జగన్ గజదొంగల ముఠా స్కీం డీపీటీనని అంటే దోచుకో.పంచుకో.

Advertisement

తినుకో అంటూ ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో గత పాలన కావాలా లేక లంచాల్లేని పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని వెల్లడించారు.

తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారని విమర్శించారు.మీ బిడ్డకు పొత్తుల్లేవ్.

సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడని చెప్పారు.అందుకు కారణం మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలు, దేవుడిని అంటూ జగన్ వ్యాఖ్యనించారు.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు