ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆ వ్యాపారవేత్త ఎంత ఖర్చుపెట్టాడో తెలుస్తే వామ్మో అనాల్సిందే !

కొంతమంది కొన్ని కొన్ని రకాల అభిరుచులు ఉంటాయి.వాటి కోసం ఏం చేయడానికైనా .

అంత ఖర్చుపెట్టడానికైనా కొంతమంది వెనకాడరు.తమ హోదా .దర్పం చూపిస్తూ.తాము ఆశించింది దక్కే వరకు వదిలిపెట్టారు.

ఇక ఎంతో ముచ్చటపడి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కొనుక్కున్న కార్ల నంబర్ల విషయంలో అయితే ఇక వెనక్కి తగ్గుతారా .? వాటికి ఫ్యాన్సీ నంబర్లు వేయించేందుకు ఖర్చుకు వెనకాడకుండా .పోటీ పడుతుంటారు.ఈ విధంగానే తమ కారుకి ఫ్యాన్సీ నెంబర్ వేయించేందుకు ఓ వ్యాపారవేత్త ఏకంగా రూ.31 లక్షలు ఖర్చు చేశాడు.వివరాల్లోకి వెళ్తే.

కేరళకు చెందిన వ్యాపారవేత్త బాలగోపాల్.తాను ఎంతో ఇష్టపడి కొనుకున్న కోటి రూపాయల ఖరీదైన పోర్ష్ కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు.వేలం పాటలో రూ.31 లక్షలు పెట్టి తాను కోరుకున్న కేఎల్ 01 సీకే 1 నంబర్‌ను సొంతం చేసుకున్నారు.

Advertisement

ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం బాలగోపాల్‌తో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు.దుబాయ్‌కు చెందిన వ్యక్తి వేలంలో రూ.10 లక్షల వరకు కోట్ చేశారు.ఆ తరువాత అతను వేలం నుంచి డ్రాప్ అయ్యారు.అయితే మరో వ్యక్తి మాత్రం ఈ నంబర్ కోసం రూ.25.50 లక్షల వరకు కోట్ చేశారు.కానీ బాలగోపాల్ ఏకంగా రూ.31 లక్షలు చెప్పడంతో.అతను కూడా వేలం పాటు నుంచి తప్పుకున్నారు.

దీంతో అత్యధిక రేటు కోట్ చేసిన వ్యాపారవేత్త బాలగోపాల్.కేఎల్ 01 సీకే 1 నంబర్‌ను సొంతం చేసుకున్నారు.

Advertisement