గజరాజును చూస్తేనే మనం భయంతో చెమటలు పట్టి ఆమెడ దూరం పరిగెడతాం.అలాంటిది మనం ప్రయాణించే బస్సుపై ఒక్కసారిగా కోపంతో ఏనుగు దాడిచేస్తే ఎలా ఉంటుంది.
అలాంటి ఓ సంఘటనే ప్రయాణికులు కేరళలోని మన్నూర్ కి బస్సులో వెళ్తుండగా చోటుచేసుకుంది.అంతటి భయంకర పరిస్థితుల్లో కూడా డ్రైవర్ భయపడలేదు.
ఏనుగు ముందు ముందుకు వస్తున్నా భయపడలేదు.అతనిపై ఇప్పుడు పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.కేరళ బస్సులో ప్రయాణికులు మన్నార్ కు వెళ్తున్నారు.
మార్గమధ్యంలో ఓ అడవి కూడా ఉంది.ఆ అడవి అందాలను చూసి ప్రయాణికులు సంబరపడుతున్నారు.
అలా అడవిగుండా వెళ్తూ.బస్సు ఓ పెద్ద మలుపు తిరిగింది.
ఆ మలుపు చివర బస్సుకు అడ్డంగా ఓ ఏనుగు నిల్చొని ఉంది.దీంతో ఏనుగును చుసిన ఆనందంలో బస్సులోని ప్రయాణికులు కేరింతలు కొడుతూ ఫోటోలు, వీడియోలు తీస్తుండగా.
ఒక్కసారిగా అది బస్సువైపు రావడం మొదలుపెట్టింది.అలా బస్సు అడ్డం వరకూ వచ్చి ఒక్కసారిగా దంతాలు, తొండెం తో బస్సు అద్దాన్ని గుద్దింది.
దీంతో ప్రయాణికులు అందరూ భయంతో అరవడం మొదలుపెట్టారు.బస్సు దంతాలతో కొట్టడంతో బస్సు అద్దానికి నెర్రలు వచ్చాయి.
ఇంత జరుగుతున్నా డ్రైవర్ మాత్రం భయపడలేదు.అది కొంచెం పక్కకు తప్పుకోగానే మెల్లిగా బస్సును ముందుకు పోనించాడు.కొంచెంసేపటి తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది.
ఇప్పటికే ఈ వీడియోను వేల సంఖ్యలో వీక్షించారు.జరిగినదంతా వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.
అది కాస్త వైరల్ గా మారింది.దీంతో పలువురు నెటిజన్లు డ్రైవర్ రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్వీటర్ అకౌంట్ లో సైతం పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy