'శబరిమల' పై బీజేపీ వ్యూహాత్మక అడుగులు..!!!

కేంద్రం రాజకీయంగా తమకి అనుకూలంగా ఉండే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.

మట్టి నుంచీ కూడా నూనె తీసి తమకి అనుకూలగా దీపం వెలిగించాలని అనుకుంటుంది.

అందుకు గుడైన , బడైన ఏదైనా సరే వాడే సుకోవడమే రాజనీతిగా బీజేపీ తనని తానూ సమర్ధించుకుంటుంది.ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది.

ఎప్పటి నుంచో దక్షిణాదిలో పాగా వేయాలని కలలు కంటున్న బీజేపీ పార్టీ ఎప్పుడు సమయం దొరుకుతుందా అని వేచి చూసింది.అయితే ఆ తరుణం రానే వచ్చింది.

తమిళనాడులో బీజేపీ ఓ మోస్తరుగా ఉనికిని చాటుకున్నా సరే తమిళ తంబీల లోకల్ సెంటిమెంట్ ముందు బీజేపీ ఎప్పుడూ బొక్క బోర్లా పడుతూ ఉండేది.సరే ఇక కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టాలన్న కోరిక తీరనూ లేదు.ఇక ఏపీలో వచ్చే ఏడాది ఆ అవకాశం లేదు.

Advertisement

తెలంగాణలోనూ దాదాపు అదే పరిస్థితి.దీంతో కేరళపై బీజేపీ ఫోకస్ చేసింది.

అందులో భాగంగానే “శబరిమల” లో మహిళల దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే అయితే ఈ అంశాన్ని బీజేపీ తమకి అనుకూలంగా మలచుకునేందుకు పావులు కదుపుతోంది.

ప్రస్తుతం కేరళలో అయ్యప్ప భక్తులకు , సామాజిక కార్యకర్తలకు మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది.సుప్రీం ఆదేశాలు పాటిస్తామని కేరళ చెప్పినా అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులు అందుకు ససేమిరా అంటున్నారు.అయితే ఇదే అదనుగా చేసుకున్న బీజేపీ ఆ ఆందోళన చేసే వారిలో తమ కార్యకర్తలు ఉండేలా చూసుకుంటోది.

కేరళలో పాగా వేసేందుకు అక్కడి ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోందట.అంతేకాదు ఇదే అదనుగా వామపక్షాల కోటని బద్దలు కొట్టాలనే ఇదే మంచి తరుణమని భావిస్తున్నారట.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

త్రిపురలో 20ఏళ్ల వామపక్ష పాలనకు చెక్ పెట్టిన బీజేపీ ఇప్పుడు కేరళను కూడా తమ హస్తగతం చేసుకునేందుకు పన్నవలసిన వ్యుహాలని అన్నిటిని పన్నుతోందట.అందుకే శబరిమల వివాదాన్ని తమకి అనుకూలం చేసుకుంటోంది.

Advertisement

“శబరిమల” అంశాన్ని “జాతీయం” చేసి హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తోందట.బీజేపీ కి తోడుగా ఈ విషయంలో శివసేన కలవడంతో బీజేపీ వ్యూహం దాదాపు ఫలించినట్టే అంటున్నారు విశ్లేషకులు.

తాజా వార్తలు