Keerthy Suresh Revathi: కీర్తి సురేష్ అక్క టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.. ప్రేమ, కౌగిలింతలు పంపుతానంటూ?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె మొదట నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్.ఆ తరువాత తెలుగులో నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి సినిమాలలో నటించి మెప్పించింది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ దసరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ అక్క రేవతికి( Revathi ) సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

ఇప్పటివరకు లైమ్ లైట్లో లేని ఈ అమ్మాయి దర్శకురాలిగా పరిచయం కాబోతుండటం విశేషమే.ఐతే ఆమె డైరెక్టర్‌గా మారుతోంది ఫీచర్ ఫిలింతో కాదు షార్ట్ ఫిలింతోనే.

Advertisement

ఆ షార్ట్ ఫిలిం పేరు థ్యాంక్ యు.( Thank You Short Film ) కాగా తన సోదరి దర్శకత్వం వహిస్తున్న షార్ట్ ఫిలిం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.Thank U అనే టైటిల్లో U అక్షరాన్ని టీ కప్పులా చూపించారు.

అలాగే కింద రెండు జతల చెప్పులు కనిపిస్తున్నాయి.ఇదంతా చూస్తుంటే ఒక జంట టీ తాగుతూ కబుర్లు చెప్పుకునే క్రమంలో నడిచే లవ్ కథలా అనిపిస్తోంది.

దీని గురించి కీర్తి స్పందిస్తూ.ఈ స్వీట్ షార్ట్ ఫిల్మ్ థ్యాంక్ యు తో నా సోదరి దర్శకురాలిగా ఎట్టకేలకు అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది.

రేవతి నీకు బోలెడంత ప్రేమ కౌగిలింతలు పంపుతున్నా అని కామెంట్ చేసింది కీర్తి సురేష్.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు