గ్లామర్ షో చేస్తున్న కీర్తి సురేష్.. దానికోసం ఎక్స్పోజింగ్ ఎక్కువైందంటూ కామెంట్స్?

ఈమధ్య ఒకప్పుడు పద్ధతిగా కనిపించే హీరోయిన్లు కూడా గ్లామర్ షోలతో బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు.

దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్ల నుండి అటువంటిది ఆశిస్తున్నారు కాబట్టి హీరోయిన్లు కూడా దర్శక నిర్మాతల కోసం తప్పదు అన్నట్లుగా గ్లామర్ షో చేస్తున్నారు.

ఇప్పటికే చాలామంది హీరోయిన్లు అందాల ఆరబోతతో సినిమాలలో షాక్ ఇచ్చారు.ఇక కీర్తి సురేష్ కూడా ఈమధ్య బాగా గ్లామర్ షో చేస్తుంది.

తాజాగా మరోసారి గ్లామర్ షో చేయగా బాగా కామెంట్స్ ఎదురుకుంటుంది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

Advertisement

ఒకప్పుడు అందం తగ్గటు తను కూడా నేచురల్ గా కనిపించేది.  తను మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతే సినిమా పరిశ్రమకు పరిచయమైంది.

ఇక ఆమె సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.

తొలిసారిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపై అడుగు పెట్టగా.తరువాత తమిళ సినిమాలలో నటించింది‌.ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

పైగా మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.మహానటి సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.

Advertisement

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటలో కూడా మంచి సక్సెస్ అందుకుంది కీర్తి.ఇక ఆ సినిమాల్లో గ్లామర్ షో కూడా చేసింది.

ఇక అప్పటినుంచి తను కూడా ఏమి తక్కువ కానట్లుగా గ్లామర్ షో చేసుకుంటూ పోతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో అక్కడ కూడా మంచి అభిమానం ఏర్పరచుకుంది.

అందులో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఒకప్పుడుకీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుండేది.

గత కొన్ని రోజుల నుండి గ్లామర్ ను పరిచయం చేసింది కీర్తి.కెరీర్ మొదట్లో అందంగా, బొద్దుగా ఉండేది.

అయితే బాగా వర్కౌట్లు చేసి చాలా సన్నబడింది.నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ చాలా అందంగా ఉండేది.

ఇక సన్నబడ్డాక మాత్రం బాగా గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది.

తన అభిమానులు మాత్రం తను సన్నగా ఉండటాన్ని ఊహించలేకపోతున్నారు.మళ్లీ మునుపటిలా మారు అంటూ బాగా సలహాలు ఇస్తున్నారు.

అయినా కూడా కీర్తి సురేష్ కు బాగా అవకాశాలు వస్తున్నాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో బాగానే గ్లామర్ షో చేసింది కీర్తి సురేష్.ఏదో ఒక బీచ్ దగ్గర ఉన్నట్లు కనిపించగా.

అందులో స్విమ్మింగ్ ఫూల్ లో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.అంతేకాకుండా మరికొన్ని ఫోటోలు కూడా ఫోజులు ఇచ్చింది.

దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం ఈమధ్య లైక్స్ కోసం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువ అయింది కీర్తి గారు అంటూ కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా హల్చల్ చేస్తున్నాయి.