జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ బాగుంటుందని చెబుతున్న కీర్తి సురేష్.. తారక్ ఛాన్స్ ఇస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR)కు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో క్రేజ్ ఉంది.

బాలీవుడ్ ప్రేక్షకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కీర్తి సురేష్( Keerthy Suresh) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాలని అభిమానులు సైతం కోరుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఈ కాంబోలొ ఇప్పటివరకు సినిమా రాలేదు.

Keerthi Suresh Comments About Junior Ntr Details Inside Goes Viral In Social Med

జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ బాగుంటుందని కీర్తి సురేష్ చెబుతుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని కీర్తి సురేష్ ఈ విధంగా చాటుకున్నారు.మహానటి మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ సమయంలో తారక్ ను తొలిసారి డైరెక్ట్ గా కలిశానని కీర్తి సురేష్ పేర్కొన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు.

Keerthi Suresh Comments About Junior Ntr Details Inside Goes Viral In Social Med
Advertisement
Keerthi Suresh Comments About Junior Ntr Details Inside Goes Viral In Social Med

మహానటి మూ(Mahanati )వీ సక్సెస్ సాధించిన తర్వాత తారక్ పార్టీ ఇచ్చారని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని కీర్తి సురేష్ కామెంట్లు చేయడం గమనార్హం.కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలలో ఏ సినిమా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.కీర్తి సురేష్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి కీర్తి సురేష్ కామెంట్స్ వస్తే భవిష్యత్తులో ఈ కాంబో ఒకింత సులువుగానే ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.ఎన్టీఆర్ కీర్తి సురేష్ జోడీ కోసం ఫ్యాన్స్ అసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు