కీరవాణి( Keeravani ) సంగీతానికి పూర్వ వైభవం వచ్చేసినట్టే కనిపిస్తోంది.చాలా ఏళ్లుగా ఆయన సోషియో ఫాంటసీ సినిమాలకు సంగీత దర్శకత్వం అందిస్తున్నారు.
ఒకప్పుడు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా వందల సినిమాలకు సంగీతం సమకూర్చిన కీరవాణి రాను కేవలం రాజమౌళి సినిమాలకు అలాగే మరి కొంతమంది దర్శకుల సినిమాలకు మాత్రమే పని చేస్తూ వచ్చారు.2010 సంవత్సరం నుంచి ఆయన జోరు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది.ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే అయినా పనిచేస్తూ వస్తున్నారు.
ఇక 2020 సంవత్సరం తర్వాత కేవలం 7 సినిమాలకు మాత్రమే ఆయన పని చేశారు అంటే మామూలు విషయం కాదు.
అయితే ఇటీవల ఆయన తీసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.ముఖ్యంగా పెళ్లి సందడి( Pelli SandaD ) ట్రిపుల్ ఆర్( RRR ) సినిమాల విజయాలతో మళ్ళీ పూర్వ వైవాన్ని అందుకున్నట్టుగానే కనిపిస్తున్నారు.2022 సంవత్సరంలో ఏకంగా నాలుగు సినిమాలతో కీరవాణి తన సత్తా చాటుకున్నారు.ట్రిపుల్ ఆర్, జయమ్మ పంచాయితీ, మోడరన్ లవ్ హైదరాబాద్, బింబిసారా సినిమాలకు ఆయన పనిచేశారు.
ఇక ఎడాది తెలుగు సినిమాలకు రెస్ట్ ఇచ్చి మలయాళంలో మెజీషియన్( Magician ) తమిళంలో చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమాలకు పని చేసిన కీరవాణి ఈ ఏడాది ఈ సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో మొట్టమొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత ప్రస్తుతం సోషియో ఫాంటసీ చిత్రంగా తెలుగు ఎక్కుతున్న చిరంజీవి విశ్వంభర సినిమాకి( Viswambhara Movie ) సైతం వశిష్ట కీరవాణి చేతనే సంగీతం చేస్తున్నాడు.అలాగే హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) చిత్రానికి కూడా కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా మహేష్ బాబు రాజమౌళి( Mahesh Babu Rajamouli ) కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి సైతం ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ కి, మహేష్ బాబుకు మొట్టమొదటిసారి తన కెరియర్లో సంగీతం అందిస్తుండడం విశేషం.
ఇక కుర్ర హీరోలు కూడా కీరవాణి చేతనే సంగీతం చేయించుకోవాలని తహతలాడుతున్నారు.దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి నటిస్తున్న లవ్ మీ( Love Me Movie ) అనే సినిమాకి కూడా కీరవాణి తన సంగీతాన్ని అందిస్తున్నారట.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy