జూనియర్ ఎన్టీఆర్ పర్మిషన్ లేనిదే కీరవాణి ఈ పాట ఎక్కడ పాడరు..ఎందుకో తెలుసా..?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి పాత్ర అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది.

ఎందుకంటే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను ఆయన అప్పుడే చేసేసారు ప్రస్తుతం మన హీరోలు ఆయన అనుకరించడం తప్ప కొత్తగా చేసేది ఏమీ లేదు అది సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అయిన అవ్వచ్చు, సినిమాలో ఆయన ఎంచుకున్న స్టోరీస్ అయినా అవ్వచ్చు.

సినిమా హీరోగానే కాదు రాజకీయాలు గా కూడా పార్టీ పెట్టి సీఎం అయినా తొలి తెలుగు నటుడు కూడా తారక రామారావు గారే, జనాలకి సేవ చేసి నటుడిగానే కాదు ఒక మంచి సీఎం గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నో చిత్రాల్లో నటించి దర్శకత్వం లో కూడా తన ప్రతిభను చూపించారు.

అయితే నందమూరి తారకరామారావు గారి పేరు పెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో జూనియర్ ఎన్టీఆర్.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్.

ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు హిట్టు లేకపోయినప్పటికీ మళ్లీ యమదొంగ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు బృందావనం సినిమా లో తను నటించిన నటనకు గాను మంచి గుర్తింపు లభించింది.పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన టెంపర్ సినిమా లో తన నటన ప్రతిభను బయటకు తీసి నందమూరి తారక రామారావు గారు గర్వపడేలా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఉందని అందరూ మెచ్చుకున్నారు.

Advertisement
Keeravaani Seeking Always Permission For Jr NTR,NTR, Raalipoye Puvva Song, Mthru

ఈ సినిమా విషయానికి వస్తే పూరి జగన్నాథ్ ని కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ లోని నటన ని పూర్తిగా బయటకి తీసి వాడుకున్న డైరెక్టర్ పూరినే.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో పూర్తిగా మేకోవర్ అయి తన స్టైలిష్ నటన ని ఆడియన్స్ కి చూపించారు.

Keeravaani Seeking Always Permission For Jr Ntr,ntr, Raalipoye Puvva Song, Mthru

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కి పోటీ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే తారక్ చాలా పెద్ద హీరో అయినప్పటికీ కీరవాణి గారు మ్యూజిక్ అందించిన మాతృదేవోభవ సినిమాలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట తారక్ కి చాలా ఇష్టమైన పాట.తారక్ కి ఆ పాట చాలా ఇష్టం అని తెలుసుకున్న కీరవాణి ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ఆ పాటని తనకి అంకితమిచ్చారు ఎప్పుడైనా సరే ఆ పాట పడాల్సి వస్తే అది ఎన్టీఆర్ ముందే పాడతానని కీరవాణి గారు చెప్పారు.ఇప్పటికీ ఆ పాట కీరవాణి పాడుతుంటే ఎన్టీఆర్ ఏడుస్తాడు తనకి అంత ఇష్టమైన పాట.తెలుగు ఇండస్ట్రీలో కీరవాణి గారు సమకూర్చిన చాలా సినిమాలా ఆల్బమ్స్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

Keeravaani Seeking Always Permission For Jr Ntr,ntr, Raalipoye Puvva Song, Mthru

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమాల్లో కీరవాణి మ్యూజిక్ అందించిన సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, దమ్ము లాంటి చిత్రాలున్నాయి.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ జక్కన్న గా చెప్పుకునే రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ ఇద్దరూ హీరోలుగా నటిస్తు మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ చిత్రానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారే.అలాగే కీరవాణి గారు గురించి చెప్పుకోవాల్సి వస్తే తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ కి పరిచయం చేసిన బాహుబలి సినిమా కూడా మ్యూజిక్ అందించింది కీరవాణి గారే.

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ మూవీ కూడా మ్యూజిక్ అందించి జనాల్ని మెస్మరైజ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు.తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నుంచి రాబోయే త్రిబుల్ ఆర్ మూవీ వరకు అన్ని సినిమాలకి మ్యూజిక్ అందించింది కీరవాణి గారే.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు