మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన కీచక టీచర్..!

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడైయ్యాడు.ఓ విద్యార్థినిపై కన్నేసిన టీచర్ ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్నాడు.

ఇంటికి వచ్చిన బాలికపై కామ పిశాచిలా విరుచుకుపడి ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడు.అంతేకాకుండా కీచక టీచర్ ఆ దారుణాన్ని మొత్తం వీడియోలో తీశాడు.

ఈ విషయం ఎవరికైనా చెప్పితే వీడియోని సోషల్ మీడియాలో పెడుతానంటూ బాలికను బెదిరింపులకు గురి చేశాడు.ఈ అమానుష ఘటన యూపీలోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.యూపీలోని గోరఖ్‌పూర్‌ నగరంలో ఓ పాఠశాలలో బాలిక ఏడో తరగతి చదువుతుంది.

Advertisement

బాలిక చదివే పాఠశాలలో మేనేజర్ హరేంద్ర యాదవ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.అతడు బాలికపై కన్నేశాడు.

కామంతో కళ్ళు మూసుకుపోయిన అతడు ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికని ఇంటికి రప్పించుకున్నాడు.ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని వీడియోలో చిత్రీకరించాడు.అంతేకాకండా తన మాటలతో బాలికను భయభ్రాంతులకు గురి చేశాడు.

ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడంటూ బాలికను బెదిరింపులకు గురి చేసేవాడు.అంతేకాక ఆమెను ఇంట్లో ఉండే చదువుకోవాలని ఒత్తిడి చేసేవాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

రోజురోజుకు అతడి వేధింపులు ఎక్కువకావడంతో బాలిక తలిదండ్రులకు విషయాన్ని చెప్పింది.భాదితురాలు పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు