కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఇప్పటినుంచి పూజలు ఎక్కడంటే..

మనదేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నా కేదార్నాథ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.ఎందుకంటే ఈ దేవాలయం ఆరు నెలలు మంచు తో కప్పబడి ఉంటుంది.

దీనితో ఉదయం పూజా కార్యక్రమాలు చేసి తలుపులు మూసి వేసిన తర్వాత ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వెళ్తారు.జై బోలో శంకర్ అంటూ నినాదాలతో వేలాది మంది భక్తులు డోలీతో స్వామివారి వెంట నడుచుకుంటూ వెళ్తారు.

ఇప్పటినుంచి వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు చేస్తారు.ఉత్తరకాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యమునోత్రి ధామ్ తలుపులు కూడా చలికాలంలో మూసివేస్తారు.

ఈరోజు భయ్యా దూజ్ సందర్భంగా యమునోత్రి తలుపులు వచ్చే ఆరు నెలల పాటు పూజారులు తలుపుల మూసివేతకు సన్నాహాలను చేస్తున్నారు.యమునా దేవి గుడి తలుపులు ఈరోజు మధ్యాహ్నం 12.09 గంటలకు అభిజిత్ ముహూర్తంలో సర్వన్ సిద్ధి యోగం చేసి మూసివేయనున్నారు.

Advertisement
Kedarnath Temple Is Closed ,kedarnath Temple ,covered With Snow,lord Shiva ,panc
Kedarnath Temple Is Closed ,Kedarnath Temple ,covered With Snow,Lord Shiva ,Panc

"/>

శని మహారాజ్ నేతృత్వంలోని యమునా దేవి ఈ రోజు యమునోత్రి ధామ్ నుండి బయలుదేరి చలికాలం ముగిసిపోయే వరకు ఖర్సాలీ గ్రామంలోనే పూజలు చేస్తారు.

ఈ ఆలయాలతో పాటు నవంబర్ 18 శుక్రవారం రెండవ కేదార మద్మహేశ్వర, నవంబర్ 7 న మూడవ కేదార తుంగనాథ్ తలుపులు కూడా పూజారులు మూసివేస్తారు.మూసివేయబడతాయి.

ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన గర్వాల్ హిమాలయ ప్రాంతంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులు బుధవారం అన్నకూట్ సందర్భంగా మూసివేశారు.చలికాలంలో ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసి వేస్తే భక్తులు ముఖ్బా గ్రామంలోని గంగామాతను పూజిస్తారు.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

నవంబర్ 19న బద్రీనాథ్ తలుపులు కూడా మూసివేయనున్నారు.హిమపాతం, శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా, ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్లలో చార్ ధామ్ లు మూసివేసి, ఏప్రిల్-మే లో తిరిగి తెరుస్తారు.

Advertisement

తాజా వార్తలు